ETV Bharat / state

Telangana Top News: టాప్​న్యూస్ @7AM - TELANGANA NEWS

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

7AM TOPNEWS
7AM TOPNEWS
author img

By

Published : Dec 12, 2022, 6:58 AM IST

దిల్లీ మద్యం కేసులో ఎమ్మెల్సీ కవితను సీబీఐ అధికారులు ఆదివారం 7గంటలకు పైగా విచారించారు. ఓ మహిళా అధికారి సహా అయిదుగురు సభ్యుల సీబీఐ బృందం దిల్లీ నుంచి వచ్చింది.

  • ఎమ్మెల్యేలకు ఎర కేసు.. తవ్వేకొద్దీ వెలుగులోకి వస్తున్న నందు అక్రమాల బాగోతాలు

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన తెరాస ఎమ్మెల్యేల ఎర కేసులో నిందితుడు నందుకు సంబంధించిన అక్రమాలు తవ్వేకొద్దీ వెలుగులోకి వస్తున్నాయి. పలువురిని మోసం చేసినట్లు గుర్తించిన అధికారులు... అతను ఇచ్చిన పదుల సంఖ్యలో చెక్కులు బౌన్స్‌ అయినట్లు తేల్చారు.

  • బీ అలర్ట్.. రాగల మూడు రోజులు వర్షాలున్నాయ్..!

రాష్ట్రంలో రాగల మూడురోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్​ వాతావరణ కేంద్రం వెల్లడించింది. అక్కడక్కడ రేపు ఉరుములతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని హెచ్చరించింది. మరోవైపు హైదరాబాద్​లోని పలు ప్రాంతాల్లో చిరుజల్లులు కురిశాయి. వర్షం వల్ల వాహనదారులు కాసేపు ఇబ్బందిపడ్డారు.

  • 'తప్పు చేస్తే ఇప్పటికీ నా కుమారుడ్ని కొడతా'.. సీక్రెట్ చెప్పేసిన సీఎం తల్లి

హిమాచల్​ ప్రదేశ్​ ముఖ్యమంత్రిగా సుఖ్విందర్ సుఖు ప్రమాణ స్వీకారం చేయడంపై ఆయన కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. సుఖు బాధ్యతలు చేపట్టడంపై ఆయన తల్లి స్పందించారు. తప్పు చేస్తే ఇప్పటికీ కుమారుడ్ని కొడతానని చెప్పారు.

  • బంగ్లాతో టెస్ట్​ సిరీస్‌.. రోహిత్​ ఔట్​.. కెప్టెన్‌గా కేఎల్ రాహుల్‌

బంగ్లాదేశ్‌తో టెస్ట్‌ సిరీస్‌లో భాగంగా టీమ్‌ఇండియాలో స్పల్ప మార్పులు జరిగాయి. గాయం కారణంగా రోహిత్‌ శర్మ ఈ సిరీస్‌కు దూరం కాగా.. అతడి స్థానంలో అభిమన్యు ఈశ్వరన్‌ ఆడనున్నాడు. కేఎల్‌ రాహుల్‌ సారథ్య బాధ్యతలు చేపట్టనున్నాడు.

  • 'IT రంగంలో భారత్​తో చైనా ఎప్పటికీ పోటీ పడలేదు!'

భారత ఐటీ రంగంతో చైనా పోటీ పడలేదని ఆ దేశ నిపుణులే స్పష్టం చేస్తున్నారు. ఐటీలో గ్లోబల్‌ లీడర్‌గా ఎదిగిన భారత్‌కు ఇప్పటికిప్పుడే డ్రాగన్‌ పోటీనిచ్చే అవకాశం లేదని ద రైజ్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఐటీ పుస్తక రచయిత మైక్‌ లియూ అన్నారు. అందరూ అనుకున్నట్లు ప్రభుత్వ విధానాలో.. లేక ఆంగ్ల భాషా పరిజ్ఞానమో భారత ఐటీ వృద్ధికి దోహదం చేయలేదన్నారు. చైనా కూడా భారత ఐటీ సంస్థల నుంచి అనేక విషయాలు నేర్చుకోవాలని సూచించారు.

  • నాసా ఆర్టెమిస్- 1 ప్రయోగం సక్సెస్.. క్షేమంగా భూమికి ఒరాయన్‌

చంద్రుడిపైకి మనుషులను తీసుకెళ్లే సన్నాహాల్లో భాగంగా నాసా చేపట్టిన ఆర్టెమిస్-1 యాత్ర విజయవంతమైంది. నవంబరు 16న నింగిలోకి దూసుకెళ్లిన ఒరాయన్‌ క్యాప్సూల్.. తిరిగి భూమిని చేరింది.

  • ఘనంగా నీలిమ గుణ వెడ్డింగ్‌ రిసెప్షన్‌.. హాజరైన మహేశ్‌, బన్నీ, జక్కన్న

వివాహ బంధంలోకి ఇటీవల అడుగుపెట్టారు నిర్మాత నీలిమ గుణ. ఆదివారం ఏర్పాటు చేసిన ఆమె రిసెప్షన్‌కు మహేశ్​ బాబు, అల్లు అర్జున్​ సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు.

  • ఈ రోజు మీ రాశి ఫలం ఎలా ఉందో చూసుకున్నారా?

ఈ రోజు(డిసెంబర్ 12) రాశి ఫలం గురించి డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ ఏమన్నారంటే?

  • నేడు దిల్లీకి కేసీఆర్.. ఎల్లుండి బీఆర్​ఎస్ కార్యాలయం ప్రారంభోత్సవం

బీఆర్​ఎస్ ఆవిర్భావం తరువాత ముఖ్యమంత్రి కేసీఆర్ తొలిసారి హస్తిన వెళుతున్నారు. ఇవాళ కుటుంబసభ్యులు, ముఖ్యనేతలతో కలిసి ఆయన దిల్లీ వెళ్తున్నారు. ఈనెల 14న బీఆర్​ఎస్ పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవంతో పాటు పలువురు జాతీయ నేతలతో ముఖ్యమంత్రి సమావేశం కానున్నారు.

  • ముగిసిన ఎమ్మెల్సీ కవిత సీబీఐ విచారణ.. 7 గంటల పాటు కొనసాగిన ప్రశ్నోత్తరాలు

దిల్లీ మద్యం కేసులో ఎమ్మెల్సీ కవితను సీబీఐ అధికారులు ఆదివారం 7గంటలకు పైగా విచారించారు. ఓ మహిళా అధికారి సహా అయిదుగురు సభ్యుల సీబీఐ బృందం దిల్లీ నుంచి వచ్చింది.

  • ఎమ్మెల్యేలకు ఎర కేసు.. తవ్వేకొద్దీ వెలుగులోకి వస్తున్న నందు అక్రమాల బాగోతాలు

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన తెరాస ఎమ్మెల్యేల ఎర కేసులో నిందితుడు నందుకు సంబంధించిన అక్రమాలు తవ్వేకొద్దీ వెలుగులోకి వస్తున్నాయి. పలువురిని మోసం చేసినట్లు గుర్తించిన అధికారులు... అతను ఇచ్చిన పదుల సంఖ్యలో చెక్కులు బౌన్స్‌ అయినట్లు తేల్చారు.

  • బీ అలర్ట్.. రాగల మూడు రోజులు వర్షాలున్నాయ్..!

రాష్ట్రంలో రాగల మూడురోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్​ వాతావరణ కేంద్రం వెల్లడించింది. అక్కడక్కడ రేపు ఉరుములతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని హెచ్చరించింది. మరోవైపు హైదరాబాద్​లోని పలు ప్రాంతాల్లో చిరుజల్లులు కురిశాయి. వర్షం వల్ల వాహనదారులు కాసేపు ఇబ్బందిపడ్డారు.

  • 'తప్పు చేస్తే ఇప్పటికీ నా కుమారుడ్ని కొడతా'.. సీక్రెట్ చెప్పేసిన సీఎం తల్లి

హిమాచల్​ ప్రదేశ్​ ముఖ్యమంత్రిగా సుఖ్విందర్ సుఖు ప్రమాణ స్వీకారం చేయడంపై ఆయన కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. సుఖు బాధ్యతలు చేపట్టడంపై ఆయన తల్లి స్పందించారు. తప్పు చేస్తే ఇప్పటికీ కుమారుడ్ని కొడతానని చెప్పారు.

  • బంగ్లాతో టెస్ట్​ సిరీస్‌.. రోహిత్​ ఔట్​.. కెప్టెన్‌గా కేఎల్ రాహుల్‌

బంగ్లాదేశ్‌తో టెస్ట్‌ సిరీస్‌లో భాగంగా టీమ్‌ఇండియాలో స్పల్ప మార్పులు జరిగాయి. గాయం కారణంగా రోహిత్‌ శర్మ ఈ సిరీస్‌కు దూరం కాగా.. అతడి స్థానంలో అభిమన్యు ఈశ్వరన్‌ ఆడనున్నాడు. కేఎల్‌ రాహుల్‌ సారథ్య బాధ్యతలు చేపట్టనున్నాడు.

  • 'IT రంగంలో భారత్​తో చైనా ఎప్పటికీ పోటీ పడలేదు!'

భారత ఐటీ రంగంతో చైనా పోటీ పడలేదని ఆ దేశ నిపుణులే స్పష్టం చేస్తున్నారు. ఐటీలో గ్లోబల్‌ లీడర్‌గా ఎదిగిన భారత్‌కు ఇప్పటికిప్పుడే డ్రాగన్‌ పోటీనిచ్చే అవకాశం లేదని ద రైజ్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఐటీ పుస్తక రచయిత మైక్‌ లియూ అన్నారు. అందరూ అనుకున్నట్లు ప్రభుత్వ విధానాలో.. లేక ఆంగ్ల భాషా పరిజ్ఞానమో భారత ఐటీ వృద్ధికి దోహదం చేయలేదన్నారు. చైనా కూడా భారత ఐటీ సంస్థల నుంచి అనేక విషయాలు నేర్చుకోవాలని సూచించారు.

  • నాసా ఆర్టెమిస్- 1 ప్రయోగం సక్సెస్.. క్షేమంగా భూమికి ఒరాయన్‌

చంద్రుడిపైకి మనుషులను తీసుకెళ్లే సన్నాహాల్లో భాగంగా నాసా చేపట్టిన ఆర్టెమిస్-1 యాత్ర విజయవంతమైంది. నవంబరు 16న నింగిలోకి దూసుకెళ్లిన ఒరాయన్‌ క్యాప్సూల్.. తిరిగి భూమిని చేరింది.

  • ఘనంగా నీలిమ గుణ వెడ్డింగ్‌ రిసెప్షన్‌.. హాజరైన మహేశ్‌, బన్నీ, జక్కన్న

వివాహ బంధంలోకి ఇటీవల అడుగుపెట్టారు నిర్మాత నీలిమ గుణ. ఆదివారం ఏర్పాటు చేసిన ఆమె రిసెప్షన్‌కు మహేశ్​ బాబు, అల్లు అర్జున్​ సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.