ETV Bharat / state

Telangana Top News: టాప్​న్యూస్ @9PM - Telugu top ten news

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

Telangana Top News today
Telangana Top News today
author img

By

Published : Nov 21, 2022, 8:57 PM IST

  • 'ఎమ్మెల్యేలకు ఎర' కేసు.. సిట్‌ విచారణ కొనసాగాల్సిందేనన్న సుప్రీంకోర్టు

రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా మారిన 'ఎమ్మెల్యేలకు ఎర' కేసులో నిందితులు దాఖలు చేసిన రెండు పిటిషన్లను సుప్రీంకోర్టు తిరస్కరించింది. తమపై నమోదు చేసిన కేసును కొట్టివేయాలంటూ... నిందితుల్లో ఒకరైన రామచంద్రభారతితో పాటు ఇతరులు ఇటీవల సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.

  • దిల్లీ మద్యం స్కామ్‌... శరత్‌చంద్రారెడ్డి, బినోయ్‌లకు 14 రోజుల కస్టడీ

దిల్లీ మద్యం స్కామ్‌ కేసులో రౌస్ అవెన్యూ కోర్టులో విచారణ జరిగింది. మనీలాండరింగ్ అంశంలో శరత్‌చంద్రారెడ్డి, బినోయ్ బాబుకు 14 రోజుల కస్టడీనిచ్చింది ధర్మాసనం. ఈడీ అభ్యర్థన మేరకు రౌస్ అవెన్యూ కోర్టు జ్యుడీషియల్ కస్టడీకి ఇచ్చింది.

  • తలసాని పీఏపై ఈడీ ప్రశ్నలవర్షం...

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన క్యాసినో కేసులో ఈడీ విచారణ కొనసాగుతుంది. శనివారం ఈడీ ఎదుట మంత్రి తలసాని పీఏ హరీష్, డీసీసీబీ ఛైర్మన్ దేవేందర్ రెడ్డి, వ్యాపారవేత్త బుచ్చిరెడ్డి హాజరయ్యారు. వారిని ఈడీ 7 గంటలపాటు సుదీర్ఘంగా విచారించింది.

  • 'కేసీఆర్ టీఆర్​ఎస్​కు మాత్రమే సీఎంగా వ్యవహరిస్తున్నారు'

రాష్ట్రంలో ప్రతిపక్షంగా లేకుండా చేయాలని బీజేపీ, టీఆర్‌ఎస్‌ కుట్రలు చేస్తున్నాయని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్​ రెడ్డి ఆరోపించారు. అప్రమత్తంగా ఉండకపోతే పార్టీ ఉనికి ప్రమాదంలో పడుతుందని ఆయన పేర్కొన్నారు. హైదరాబాద్​లోని గాంధీభవన్‌లో టీపీసీసీ అనుబంధ సంఘాల నేతలతో సమావేశమైన ఆయన.. నాయకులకు దిశా నిర్ధేశం చేశారు.

  • 'కుప్పంలోనూ ఓడిపోతాననే భయం చంద్రబాబుకు పట్టుకుంది'

తమిళనాడు, కేరళ తర్వాత దేశంలోనే నరసాపురం ఫిషరీస్‌ విశ్వవిద్యాలయం మూడోదని ఏపీ సీఎం జగన్​ వ్యాఖ్యానించారు. పశ్చిమగోదావరి జిల్లాలో పర్యటించిన ఆయన.. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు.

  • కర్ణాటక బాంబు దాడి కేసులో.. అంతర్జాతీయ ఉగ్రసంస్థల హస్తం!

మంగళూరు ఆటోరిక్షాలో పేలుడు వెనక.. అంతర్జాతీయ ఉగ్రసంస్థ ప్రభావం ఉందని కర్ణాటక పోలీసులు గుర్తించారు. మంగళూరు, మైసూరు, శివమొగ్గల్లో.. విధ్వంసానికి కుట్ర పన్నినట్లు తెలిపారు. ఆటో పేలుడులో గాయపడిన మహమ్మద్‌ షరీఖ్‌.. సూత్రధారి అని వివరించారు.

  • గెలుపు గుర్రాలు వారే.. గుజరాత్​లో వారసులకే కాంగ్రెస్​, భాజపా టికెట్లు!

సాధారణ సమయాల్లో వారసత్వ రాజకీయాలపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించే రాజకీయ పార్టీలు ఎన్నికల సమయంలో మాత్రం ఆ సంప్రదాయాన్ని కొనసాగిస్తూనే ఉంటాయి. త్వరలో జరగబోయే గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల్లోనూ పలు స్థానాల్లో వారసులు బరిలోకి దిగుతున్నారు.

  • భారీ భూకంపం.. 56 మంది మృతి..

భారీ భూకంపం ఇండోనేసియాను కుదిపేసింది. ఈ ఘటనలో 56 మంది ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 700 మంది గాయాలయ్యాయి. శిథిలాల కింద అనేక మంది చిక్కుకుని ఉండొచ్చని, మృతుల సంఖ్య మరింత పెరగొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.

  • ఫుట్​బాల్ క్లబ్​ల మ్యాచ్ ఫిక్సింగ్..

ప్రపంచమంతా ప్రస్తుతం ఫిఫా వరల్డ్ కప్‌ సందడే కనిపిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో దేశంలోని ఫుట్​బాల్ క్రీడలో ఫిక్సింగ్ ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. ఫిక్సింగ్ కేసులో పలు క్లబ్​ల పేర్లు సైతం వినిపిస్తున్నాయి. తాజాగా దీనిపై కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ ప్రాథమిక విచారణ చేపట్టింది.

  • చిరంజీవిపై ప్రధాని మోదీ ప్రశంసల వర్షం..

మెగాస్టార్‌ చిరంజీవిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశంసల వర్షం కురిపించారు. 'ఇండియన్‌ ఫిలిం పర్సనాలిటీ ఆఫ్‌ ది ఇయర్‌ - 2022' పురస్కారం చిరంజీవిని వరించడంపై మోదీ స్పందిస్తూ తాజాగా ఓ ట్వీట్‌ చేశారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.