ETV Bharat / state

Telangana Top News: టాప్​న్యూస్ @3PM - తెలంగాణ వార్తలు

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

telangana top news
telangana top news
author img

By

Published : Oct 28, 2022, 3:00 PM IST

  • ఎమ్మెల్యేల కొనుగోలు అంశం.. హైకోర్టును ఆశ్రయించిన సైబరాబాద్ పోలీసులు

తెరాస ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ముగ్గురి నిందితులకు రిమాండ్‌ విధించడానికి... ఏసీబీ కోర్టు న్యాయమూర్తి నిరాకరించడాన్ని సవాల్‌ చేస్తూ సైబరాబాద్‌ పోలీసులు హైకోర్టును ఆశ్రయించారు. పిటిషన్‌ను అత్యవసరంగా విచారించాలని ఉన్నత న్యాయస్థానాన్ని కోరారు.

  • రూ.100 కోట్లు ఇచ్చి ఎమ్మెల్యేలను కొనాల్సిన అవసరం భాజపాకు లేదు: కిషన్‌రెడ్డి

తెలంగాణలో భాజపా వస్తుందనే భయంతోనే తెరాస కట్టుకథలు చెబుతోందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి మండిపడ్డారు. మాయ మాటలతో డ్రామా సృష్టించి ప్రజలను మభ్య పెట్టేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. ఎమ్మెల్యేల కొనుగోలు ఆరోపణలపై సిట్టింగ్‌ న్యాయమూర్తి, సీబీఐతో విచారణ జరిపించాలని ఆయన డిమాండ్‌ చేశారు.

  • 'తెరాస ఎమ్మెల్యేల ఎర'.. నిందితులకు సీఆర్​పీసీ 41 నోటీసులు

'తెరాస ఎమ్మెల్యేలకు ఎర' సరైనా ఆధారాలు లేవంటూ.. ముగ్గురు నిందితులకు రిమాండ్​ విధించేందుకు ఏసీబీ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి నిరాకరించి, వారిని తక్షణమే విడుదల చేయాలన్నారు. 41 సీఆర్​పీసీ కింద నోటీసులు ఇచ్చిన తరవాతనే విచారించాలని న్యాయమూర్తి స్పష్టం చేసిన కొన్ని గంటల్లోనే నిందితులకు పోలీసులు 41 సీఆర్‌పీసీ కింద నోటీసులు జారీ చేశారు.

  • 'దేశంలో పోలీసులందరికీ ఇక ఒకే యూనిఫాం!'

దేశవ్యాప్తంగా పోలీసులందరికీ ఒకే యూనిఫాం ఉండాలని ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిపాదన చేశారు. ఇది సూచన మాత్రమేనని.. రాష్ట్రాలపై రుద్దే ఉద్దేశం లేదని ఆయన అన్నారు. హరియాణాలో జరుగుతున్న రాష్ట్ర హోంమంత్రుల సమావేశాన్ని ఉద్దేశించి దిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మోదీ ప్రసంగించారు.

  • నదిపై వంతెన కట్టిన గ్రామస్థులు..

ఒడిశా కొరాపుట్ జిల్లా దస్మంత్​పుర్ బ్లాక్​కు చెందిన నందిగాన్ గ్రామ పంచాయతీ ప్రజలు సొంత నిధులతో వంతెన ఏర్పాటు చేశారు. ఈ పంచాయతీ పరిధిలో ఉన్న నది రాక పోకలకు అవరోధంగా మారింది. దీని వంతెన నిర్మాణం చేపట్టాలని అధికారులకు స్థానికులు చాలా సార్లు మొరపెట్టుకున్నారు.

  • సమాధిలోని చిన్నారి మృతదేహం నుంచి తల మాయం..

సమాధిలో ఉన్న మృతదేహం నుంచి తలను వేరు చేసిన ఘటన తమిళనాడులో వెలుగుచూసింది. ఇలా చేయడం వెనుక చేతబడి వంటి కారణాలు ఉన్నాయా? లేక కేసును దారి మళ్లించేందుకే ఇలా చేస్తున్నారా? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

  • వరల్డ్​ కప్​లో మళ్లీ వరుణుడి ఆట..

ఆస్ట్రేలియా వేదికగా జరుగుతోన్న టీ20 ప్రపంచకప్‌ టోర్నమెంట్‌కు వరుణుడు అడ్డంకిగా మారాడు. సూపర్ -12 పోరులో భాగంగా అఫ్గానిస్థాన్‌, ఐర్లాండ్‌ జట్ల మధ్య మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దైంది.

  • చెన్నైలో ఘనంగా యువ నటుడి వివాహం

కోలీవుడ్‌ యువ నటుడు హరీశ్‌ కల్యాణ్‌ ఒక ఇంటివాడయ్యారు. నర్మదా ఉదయ్‌కుమార్‌ మెడలో శుక్రవారం ఉదయం మూడు ముళ్లు వేశారు. ప్రస్తుతం వీరి పెళ్లికి సంబంధించిన ఫొటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.

  • తెలుగులో దూసుకెళ్తోన్న 'కాంతార'..

రిష‌బ్‌శెట్టి హీరోగా న‌టించిన 'కాంతార' సినిమా తెలుగు రాష్ట్రాల్లో క‌లెక్ష‌న్స్ ప‌రంగా దూసుకెళ్తోంది. అయితే మూడో వారంలో ఈ సినిమా థియేట‌ర్ల సంఖ్య రెట్టింపు కావ‌డం ట్రేడ్ వ‌ర్గాల్లో ప్రస్తుతం హాట్‌టాపిక్‌గా మారింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.