Telangana TET Results 2023 : ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) ఫలితాలు కాసేపట్లో విడుదలయ్యాయి. ఉదయం పది గంటల నుంచి అధికార వెబ్సైట్ tstet.cgg.gov.in లో ఫలితాలు అందుబాటులో ఉన్నాయని టెట్ కన్వీనర్ రాధారెడ్డి(TET Convenor Radha Reddy) తెలిపారు. ఇటీవలే ప్రాథమిక కీని విద్యాశాఖ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈనెల 15న 1139 కేంద్రాల్లో జరిగిన టెట్ పేపర్-1కు 2 లక్షల 26 వేల 744 మంది.. పేపర్-2కు లక్ష 89 వేల 963 మంది హాజరయ్యారు. విద్యా హక్కు చట్టం, జాతీయ ఉపాధ్యాయ విద్య మండలి నిబంధనల ప్రకారం, ప్రకారం ఒకటి నుంచి ఎనిమిదో తరగతి వరకు బోధించాలంటే తప్పనిసరిగా టెట్‌లో అర్హత సాధించాలి.
ఫలితాలను కింది విధంగా చెక్ చేసుకోండి :
step : 1 అధికార వెబ్సైట్ tstet.cgg.gov.in ని క్లిక్ చెయ్యండి
step : 2 వెబ్సైట్ హోం పేజ్ ఓపెన్ అవుతుంది. అందులో చివరి బాక్స్‌లో డౌన్లోడ్ టీఎస్ రిజల్ట్స్- టీఎస్ టెట్ 2023 ఉంటుంది.
step : 3 Download Results ఆప్షన్ క్లిక్ చెయ్యాలి
Step : 4 హాల్‌టికెట్ నంబర్ అడుగుతుంది. మీ Hall TICKET Number ఎంటర్ చేయాలి
Step : 5 Get Results ఆప్షన్ క్లిక్ చేస్తే మీ మార్కులు తెలుసుకోవచ్చు.
Step : 6 చివరిలో మీ మార్కులను ప్రింట్ చేసుకోవచ్చు.
రాష్ట్రవ్యాప్తంగా ప్రశాంతంగా టెట్ నిర్వహణ.. భారీగా హాజరుశాతం నమోదు
TET Results Telangana Today : రాష్ట్రంలో ఇప్పటివరకు అన్ని టెట్లు కలిపి పేపర్-1లో లక్షన్నర.. పేపర్-2లో రెండున్నర లక్షల మంది అభ్యర్థులు ఉత్తీర్ణులయ్యారు. రాష్ట్రంలో చివరగా 2022 జూన్ 12న విద్యాశాఖ టెట్ నిర్వహించింది. టెట్ అర్హత కాలపరిమితి జీవితకాలం ఉంటుంది. పేపర్-1లో ఉత్తీర్ణులైన వారు ఒకటి నుంచి అయిదు తరగతులకు బోధించే ఎస్జీటీ పోస్టులకు.. పేపర్-2లో ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఆరు నుంచి 8వ తరగతి వరకు బోధించే స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగాలకు అర్హులు.
ఉపాధ్యాయ నియామకాల కోసం రాష్ట్రంలో 5000పైగా ఉద్యోగాలతో డీఎస్సీ నోటిఫికేషన్ జారీ అయింది. అప్లికేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. మెగా డీఎస్సీ నోటిఫికేషన్, పరీక్ష సన్నద్ధం అయేందుకు గడువు కావాలని డీఎస్సీ అభ్యర్థులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో పలుచోట్ల నిరసనలు తెలియజేస్తున్నారు. నవంబరు 20 నుంచి 30 వరకు ఉపాధ్యాయ నియామక పరీక్ష (Teacher Recruitment Test).. టీఆర్టీ జరగనుంది.
Telangana TET Exam 2023 : నేడే ఉపాధ్యాయ అర్హత పరీక్ష.. ఆ విద్యా సంస్థలకు సెలవు
Telangana TeT Notification 2023 : టెట్ పరీక్ష దరఖాస్తుకు నేడే ఆఖరి రోజు
TET Exam Telangana 2023 : రేపే 'టెట్' పరీక్ష.. ఈ విషయాలు తప్పక తెలుసుకోవాల్సిందే..!