ప్రజల ప్రాణాలను కాపాడేందుకు ప్రాణాలను పణంగా పెడుతున్న వైద్యులు, ఆశావర్కర్లు, ఏఎన్ఎంల ఆరోగ్యాన్ని సర్కార్ గాలికి వదిలేసిందని తెతెదేపా మహిళా విభాగం అధ్యక్షురాలు ప్రొఫెసర్ జోత్స్న మండిపడ్డారు. తెలంగాణలో ప్రజారోగ్యం సర్కారుకు పట్టడం లేదని ఆక్షేపించారు.
వైద్యులు స్వచ్ఛందంగా బయటకు వచ్చి... పీపీఈ కిట్ల నాణ్యతను ప్రశ్నిస్తున్నా పట్టించుకున్న నాథుడు లేడని విమర్శించారు. సగటున పది లక్షల మంది ప్రజలకు ఎన్ని కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారో వివరాలను బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. దీనిపై సర్కారు శ్వేత పత్రం విడుదల చేయలని కోరారు. కొవిడ్ ఆసుపత్రిగా మార్చిన గచ్చిబౌలి ఆసుపత్రిలో కనీస సౌకర్యాలు లేవని ఆమె దుయ్యబట్టారు.