ETV Bharat / state

జీతాలు చెల్లించడం లేదని ప్రగతి భవన్​ ముట్టడికి యత్నం

ప్రైవేటు కళాశాలలు తమకు జీతాలు చెల్లించడం లేదని ఆరోపిస్తూ ఉద్యోగులు ప్రగతిభవన్​ ముట్టడికి యత్నించారు. వెంటనే వేతనాలు చెల్లించాలని డిమాండ్​ చేశారు. ఆందోళన చేస్తున్న వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

telangana technical college employees association tried to siege pragathi bhavan
జీతాలు చెల్లించడం లేదని ప్రగతి భవన్​ ముట్టడికి యత్నం
author img

By

Published : Dec 27, 2020, 2:53 PM IST

తెలంగాణ టెక్నికల్ కాలేజ్‌ ఎంప్లాయీస్‌ అసోసియేషన్ అధ్వర్యంలో ఉద్యోగులు.. ప్రగతిభవన్‌ ముట్టడికి యత్నించారు. ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలు తమకు వేతనాలు ఇవ్వడం లేదని ఆరోపించారు. వెంటనే జీతాలు చెల్లించేలా యాజమాన్యాలను ప్రభుత్వం ఆదేశించాలని డిమాండ్ చేశారు.

ప్రైవేటు కళాశాలలకు ప్రభుత్వం వత్తాసు పలకడంతోనే వాళ్లు వేతనాలు చెల్లించడంలేదని ఉద్యోగులు విమర్శించారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు.. ఆందోళనకారులను అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి తరలించారు.

ఆందోళనకారులను అదుపులోకి తీసుకుంటున్న పోలీసులు

ఇదీ చదవండి: రుణ యాప్‌ల వేధింపుల కేసులో మరో ముగ్గురు అరెస్టు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.