Telangana Tax Revenue November 2023 : అక్టోబర్‌తో పోలిస్తే నవంబర్‌లో రాష్ట్ర ఖజానాకు పన్నుల ద్వారా వచ్చే ఆదాయం తగ్గింది. కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్- కాగ్‌కు రాష్ట్ర ప్రభుత్వం ఈ మేరకు వివరాలు అందించింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు ఆగస్టు నెలలో అత్యధికంగా రూ.12,729 కోట్ల పన్ను రాబడి వచ్చింది. అక్టోబర్‌లో రూ.10,691 కోట్లు రాగా నవంబర్‌లో రూ.9,701 కోట్లకు తగ్గింది. ఆర్థిక సంవత్సరం ప్రారంభ నెల అయిన ఏప్రిల్‌లో రూ.9,698 కోట్ల ఆదాయం వచ్చింది. 2022 నవంబర్‌లో రూ.10,726 కోట్ల ఆదాయం రాగా ఈ ఏడాది నవంబర్‌లో మాత్రం రాబడి తగ్గింది.
నెలల వారీగా రాష్ట్ర ఖజానాకు వచ్చిన పన్నుల రాబడి :
నెల | పన్నుల రాబడి(కోట్లలో) |
ఆగస్టు | 12,729 |
అక్టోబర్ | 10,691 |
నవంబర్ | 9,701 |
రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై సర్కార్ ఫోకస్ - శాసనసభ వేదికగా లెక్కతేల్చేందుకు సిద్ధం
Telangana Budget Details : ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నవంబర్ నెల ముగిసే నాటికి రాష్ట్ర ఖజానాకు పన్నుల రూపం(Telangana Government November Collect Tax)లో వచ్చిన ఆదాయం రూ.87,083 కోట్లు. బడ్జెట్ అంచనా అయిన రూ.1,52,499 కోట్లలో ఇది 57 శాతానికిపైగా ఉంది. జీఎస్టీ ద్వారా రూ.30,047 కోట్లు స్టాంపులు- రిజిస్ట్రేషన్ల ద్వారా రూ.9,354 కోట్లు అమ్మకం పన్ను ద్వారా రూ.19,591 కోట్లు ప్రభుత్వానికి వచ్చాయి. ఎక్సైజ్ పన్నుల ద్వారా రూ.14,607 కోట్లు కేంద్ర పన్నుల్లో రాష్ట్ర వాటాగా రూ.8,177 కోట్లు సమకూరాయి. ఇతర పన్నుల రూపంలో మరో రూ.5,304 కోట్లు ఖజానాకు చేరాయి. పన్నేతర ఆదాయం బడ్జెట్‌లో రూ.22,808 కోట్లు అంచనా వేయగా నవంబర్ చివరి నాటికి రూ.19,524 కోట్లు ఖజానాకు వచ్చాయి.
నవంబర్ నెలలో రాష్ట్రానికి వచ్చిన పన్నుల వివరాలు :
పన్నుల రకం | రాబడి(కోట్లలో) |
జీఎస్టీ | 30,047 |
స్టాంపులు- రిజిస్ట్రేషన్లు | 9,354 |
అమ్మకం పన్ను | 19,591 |
ఎక్సైజ్ పన్ను | 14,607 |
రాష్ట్ర వాటా | 8,177 |
ఇతర పన్నులు | 5,304 |
మొత్తం | 87,083 |
Telangana Government Collect TAX Amount at November : ఎనిమిది నెలల్లో వచ్చిన రెవెన్యూ రాబడుల మొత్తం రూ.1,11,141 కోట్లు. బడ్జెట్‌లలో అంచనా వేసిన రూ.2,16,566 కోట్ల(Telangana Budget 2023-24)లో ఇది 51 శాతానికి పైగా ఉంది. ఈ ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం రుణాల ద్వారా ఇప్పటి వరకు రూ.38,151 కోట్లు సమీకరించుకొంది. నవంబర్ వరకు ఖజానాకు చేరిన నిధుల మొత్తం రూ.1,49,316 కోట్లు. ఇప్పటి వరకు చేసిన మొత్తం వ్యయం రూ.1,44,34 కోట్లగా ఉంది.
రాష్ట్ర ఆర్థికశాఖపై సీఎం రేవంత్‌రెడ్డి సమీక్ష - '2024-25 బడ్జెట్లో వాస్తవాలు ప్రతిబింబించాలి'
Telangana Revenue Department Collects Tax : రెవెన్యూ వ్యయం రూ.1,14,746 కోట్లు కాగా మూలధన వ్యయం రూ.29,288 కోట్లు. రెవెన్యూ వ్యయంలో వడ్డీ చెల్లింపుల కోసం రూ.14,687 కోట్లు వేతనాల కోసం రూ.26,548 కోట్లు ఖర్చు చేశారు. పెన్షన్ల కోసం రూ.11,316 కోట్లు రాయతీలపై రూ.6,156 కోట్ల వ్యయం చేశారు. నవంబర్ నెలాఖరు వరకు సాధారణ రంగంపై రూ.35,925 కోట్లు, సామాజిక రంగంపై రూ.44,108 కోట్లు ఆర్థిక రంగంపై రూ.64,000 కోట్లను ప్రభుత్వం ఖర్చు చేసింది. రూ.3604 కోట్ల రెవెన్యూ లోటు రూ.38,151 కోట్ల ఆర్థిక లోటు ఉన్నట్లు సర్కార్ పేర్కొంది.
రూ.2.16 లక్షల కోట్ల ఆదాయం.. బడ్జెట్లో ప్రభుత్వం అంచనా
రాష్ట్ర బడ్జెట్ 2023.. సాగుకు భళా.. సంక్షేమ కళ.. పేదల గూటికి ప్రాధాన్యం