రక్షిత స్మారక చిహ్నాలపై నివేదికలు తయారు చేయాలని రాష్ట్ర హెరిటేజ్(HERITAGE) అథారిటీ అధికారులను ఆదేశించింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్(CS SOMESH KUMAR) అధ్యక్షతన రాష్ట్ర హెరిటేజ్ అథారిటీ తొలి సమావేశం జరిగింది. హైదరాబాద్ జంట నగరాల్లోని 26 రక్షిత స్మారక చిహ్నాలు, కుతుబ్ షాహీ సమాధుల గురించి చర్చించారు.
గోల్కొండ కోటకు(GOLCONDA FORT) సంబంధించిన సమస్యలపైనా కమిటీ దృష్టి సారించింది. రక్షిత స్మారక చిహ్నాలపై నివేదికలు తయారు చేయాలని... బఫర్ జోన్ ముసాయిదా మార్గదర్శకాలను సమర్పించాలని కమిటీ ఆదేశించింది. రామప్ప(RAMAPPA) ఆలయ అభివృద్ధి కోసం ప్రణాళిక సమర్పించాలని రాష్ట్ర హెరిటేజ్ అథారిటీ ఆదేశాలు జారీచేసింది.
ఇదీ చదవండి: ఐశ్వర్యా రాయ్ ప్రెగ్నెన్సీతో ఉందా?