ETV Bharat / state

చట్ట సవరణల కోసం... అసెంబ్లీ సమావేశాల ఏర్పాటుకు యోచన - చట్టసవరణల కోసం ఏర్పాట్లు

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌తోపాటు కొన్ని ఇతర చట్టాలకు రాష్ట్ర ప్రభుత్వం సవరణలు చేయనుంది. అందుకోసం ఈనెల 12, 13 తేదీల్లో శాసనసభ సమావేశాలు ప్రత్యేకంగా జరిగే అవకాశం ఉంది. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల చట్టానికి సవరణతో పాటు హైకోర్టు సూచనలకు అనుగుణంగా సీఆర్​పీసీ చట్టానికి ప్రభుత్వం సవరణలు చేయనుంది.

చట్ట సవరణల కోసం... అసెంబ్లీ సమావేశాల ఏర్పాటుకు యోచన

author img

By

Published : Oct 8, 2020, 8:42 PM IST

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు త్వరలో జరగనుండగా.. రాష్ట్ర ప్రభుత్వం చట్టసవరణ చేయనుంది. పంచాయతీరాజ్, పురపాలక చట్టాల తరహాలోనే జీహెచ్​ఎంసీ, హెచ్​ఎండీఏకు కొత్త చట్టాన్ని తీసుకొచ్చేందుకు ప్రభుత్వం కొనాళ్లుగా కసరత్తు చేస్తోంది. ఆ ప్రక్రియ పూర్తి కాకపోవడం వల్ల సవరణలు తీసుకురావాలని నిర్ణయించింది. రెండు వరుస ఎన్నికల్లో రిజర్వేషన్ ఉండే అంశాన్ని పంచాయతీరాజ్, పురపాలకచట్టాల్లో పొందుపర్చగా.. జీహెచ్​ఎంసీలోనూ అందుకు అనుగుణంగా రిజర్వేషన్ల విధానాన్ని అమలు చేసేలా చట్ట సవరణ చేసే అవకాశం ఉంది. గతంలో ఉన్న ఇద్దరికి మించి సంతానం పరిమితిని గ్రామపంచాయతీలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో తొలగించారు. అదే తరహాలో గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లోనూ అమలు చేసేలా చట్టసవరణ చేయనున్నారు. డివిజన్ల సంఖ్యను 200కు పెంచాలన్న ప్రతిపాదన ఉండగా.. సవరణకు అవకాశం లేకపోలేదు. హైదరాబాద్‌ పరిధిలో 10 లక్షల సీసీ కెమెరాల ఏర్పాటుకు అనుగుణంగా చట్టసవరణ చేసే అవకాశం ఉంది.

అధికారాల తొలగింపు దిశగా..

నూతన రెవెన్యూ విధానంలో భాగంగా సబ్ రిజిస్ట్రార్లకు ఉన్న విచక్షణాధికారాలను తొలగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. భూముల విలువను నిర్ధరించే 47(ఏ) సెక్షన్ కింద ఉన్న అధికారాలను తొలగించనున్నారు. అందుకు సంబంధించి స్టాంపులు, రిజిస్ట్రేషన్ల చట్టానికి ప్రభుత్వం చట్టసవరణ చేయనుంది. దసరా నుంచి ధరణి అమల్లోకి రానుండగా చట్టసవరణను ఈ సమావేశాల్లోనే చేసే అవకాశం ఉంది. నిందితులకు పూచీకత్తు అంశానికి సంబంధించి చట్టసవరణ చేసే అవకాశం ఉంది. కోర్టు వాయిదాలకు నిందితులు హాజరు కాకపోతే పూచీకత్తు ఇచ్చిన వారిపై చర్యలు తీసుకునేలా చట్టాన్ని సవరించాలని హైకోర్టు సూచించింది. అందుకు అనుగుణంగా ప్రభుత్వం చట్టసవరణ చేసే అవకాశం ఉంది.

చట్టసవరణలు, శాసనసభ సమావేశాల నిర్వహణకు సంబంధించి శుక్రవారం తుదినిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. సమావేశాలపై నిర్ణయం వెలువడితే శని, ఆదివారాల్లో రాష్ట్ర మంత్రివర్గం సమావేశమై చట్టసవరణలకు ఆమోదం తెలపనుంది. ఇటీవల సమావేశాల అనంతరం ఉభయ సభలు ప్రోరోగ్ కాలేదు. అందువల్ల గవర్నర్ నోటిఫికేషన్ జారీ చేయాల్సిన అవసరం లేదు. శాసనసభ సచివాలయం నుంచి సభ్యులకు సమాచారం ఇచ్చి అసెంబ్లీ, కౌన్సిల్‌ను సమావేశపరచవచ్చు.

ఇదీ చూడండి: కాంగ్రెస్​, భాజపాలు రెండూ రెండే.. రైతులకు మేలు జరగదు: హరీశ్​ రావు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.