ETV Bharat / state

'అమరవీరుల ఆశయాల సాధన కోసం మరో పోరాటం' - ప్రొఫెసర్‌ జయశంకర్‌ మానవ వనరుల అభివృద్ధి కేంద్రం

రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏడేళ్ల తెలంగాణ ఉద్యమ విలువల అంశంపై ప్రొఫెసర్‌ జయశంకర్‌ మానవ వనరుల అభివృద్ధి కేంద్రం ఆధ్వర్యంలో వర్చువల్‌ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖులు పాల్గొని వారి అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఈ సభలో తెజస అధ్యక్షుడు కోదండరాం, శాసనమండలి మాజీ ఛైర్మన్‌ స్వామిగౌడ్‌, సీనియర్ పాత్రికేయులు కె.రామచంద్రమూర్తి, కె.శ్రీనివాస్‌, విమలక్క, అద్దంకి దయాకర్‌, పోటు రంగారావు, ప్రొఫెసర్‌ హరగోపాల్‌ పాల్గొన్నారు.

Telangana state formation meeting for completing  on seven years
ఏడేళ్ల తెలంగాణ ఉద్యమ విలువల అంశంపై ప్రొఫెసర్‌ జయశంకర్‌ మానవ వనరుల అభివృద్ధి కేంద్రం ఆధ్వర్యంలో వర్చువల్‌ సమావేశం
author img

By

Published : Jun 2, 2021, 9:17 PM IST

అమరవీరుల ఆశయాల సాధన కోసం మరో పోరాటం నిర్వహిస్తామని తెజస అధ్యక్షుడు ఆచార్య కోదండరాం స్పష్టం చేశారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏడేళ్ల తెలంగాణ ఉద్యమ విలువల అంశంపై ప్రొఫెసర్‌ జయశంకర్‌ మానవ వనరుల అభివృద్ధి కేంద్రం ఆధ్వర్యంలో నిర్వహించిన వర్చువల్ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సమావేశంలో పాల్గొన్న పలువురు ప్రముఖులు ఉద్యమంపై తమ అభిప్రాయాలను వెల్లడించారు. ఈ సభలో తెజస అధ్యక్షుడు కోదండరాంతో పాటు శాసనమండలి మాజీ ఛైర్మన్‌ స్వామిగౌడ్‌, సీనియర్ పాత్రికేయులు కె.రామచంద్రమూర్తి, కె.శ్రీనివాస్‌, విమలక్క, అద్దంకి దయాకర్‌, పోటు రంగారావు, ప్రొఫెసర్‌ హరగోపాల్‌ పాల్గొన్నారు.

ఏడేళ్ల పాలనపై ప్రముఖుల అభిప్రాయాలు

పోరాడి సాధించుకున్న తెలంగాణలో విద్యా, వైద్య రంగాలు పూర్తిగా ధ్వంసమయ్యాయని న్యూడెమోక్రసీ సీనియర్‌ నేత పోటు రంగారావు అన్నారు. ప్రభుత్వం ప్రతి అంశంలో ప్రజలను మభ్యపెట్టే వైఖరిని అనుసరిస్తోందని మండిపడ్డారు. తెలంగాణ ప్రజలు కేసీఆర్‌ చేస్తున్న పాలనను కోరుకోలేదన్నారు.

ఉద్యమ పార్టీ అని చెప్పుకుంటూనే పోరాట చరిత్రకు తెరాస ద్రోహం చేస్తోందని కాంగ్రెస్‌ నేత అద్దంకి దయాకర్‌ ఆరోపించారు. ఉద్యమ విలువలను అణగదొక్కుతున్న ప్రభుత్వ తీరును ఎండగట్టాల్సిన అవసరముందన్నారు.

తెలంగాణ ప్రజలు ఉద్యమ విలువలతోనే అనేక పోరాటాలు చేశారని ప్రొఫెసర్‌ హరగోపాల్‌ తెలిపారు. ప్రజల్లో ఉన్న చైతన్యాన్ని రక్షించుకోవాలన్నారు.

ఏడేళ్ల తెలంగాణలో వెనక్కి తిరిగి చూస్తే ఏమీ లేదని అరుణోదయ కళాకారిణి విమలక్క ఆవేదన వ్యక్తం చేశారు. తొలి, మలిదశ పోరాటాల ఆకాంక్షలు నెరవేరలేదన్నారు. ఐక్య ఉద్యమాల ద్వారానే అమరుల ఆకాంక్షలను సాధిస్తామని తెలిపారు

ఇదీ చూడండి: Formation Day: రాష్ట్రవ్యాప్తంగా నిరాడంబరంగా ఆవిర్భావ వేడుకలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.