రాష్ట్రంలోని వివిధ యూనివర్సిటీల పరిధిలో డిగ్రీ ఫలితాలు సోమవారం నాటికి విడుదలవుతాయని ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ ఆచార్య పాపిరెడ్డి తెలిపారు. ఫలితాల వెల్లడి ప్రక్రియకు వేగం పెంచామని చెప్పారు. వివిధ కేంద్ర యూనివర్సిటీల్లో పీజీ సీట్లు పొందిన విద్యార్థులు సీట్లు కోల్పోయే అవకాశం ఉండదన్నారు. విద్యార్థులు ఆందోళన పడాల్సిన అవసరం లేదని, సెంట్రల్ యూనివర్సిటీల్లో ధ్రువపత్రాలు సమర్పించేందుకు ఆగస్టు 31 వరకు గడువు ఉందని పేర్కొన్నారు.
ఇదీ చూడండి : 'విద్యారంగంలో నూతన విధానానికి భాజపా కృషి'