Telangana State cabinet meeting : రైతుబంధు నిధులు, ఇండ్ల నిర్మాణానికి ఆర్థికసాయం విషయమై రాష్ట్ర మంత్రివర్గం శనివారం కీలక నిర్ణయం తీసుకోనుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ఈనెల పదో తేదీ మధ్యాహ్నం రెండు గంటలకు ప్రగతిభవన్‌లో కేబినెట్ భేటీ కానుంది. మూడు నెలల విరామం తర్వాత రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానుంది. ధాన్యం కొనుగోళ్లు, రైతుబంధు నిధుల విడుదల, సొంత జాగలు ఉన్న బలహీన వర్గాలకు గృహ నిర్మాణం అంశం, దళిత బంధు అమలు, తదితర అంశాలపై మంత్రివర్గంలో చర్చించే అవకాశం ఉంది. రహదార్ల మరమ్మతులు, ఆర్ అండ్ బీ, పంచాయతీ రాజ్ శాఖల పునర్వ్వస్థీకరణ, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, కేంద్ర ప్రభుత్వ వైఖరి, ఆర్థిక ఆంక్షలు కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది.
ఆర్థిక పరమైన అంశాలపై చర్చించి కేంద్ర వైఖరిని ఎండ గట్టెందుకు శాసనసభ సమావేశాలు నిర్వహించాలని సీఎం కేసీఆర్ ఇప్పటికే నిర్ణయించారు. అసెంబ్లీ సమావేశాల నిర్వహణ విషయమై కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది. గవర్నర్ వద్ద పెండింగ్‌లో ఉన్న ఎనిమిది బిల్లుల వ్యవహారంపై కూడా మంత్రివర్గంలో చర్చించే అవకాశం ఉంది. ఈ విషయమై తదుపరి కార్యాచరణపై చర్చించడంతోపాటు త్వరగా ఆమోదించాలని కోరుతూ కేబినెట్‌లో అవసరమైతే తీర్మానం చేసే అవకాశముంది.
ఇవీ చూడండి: