దిల్లీలోని రాజ్‌పథ్‌లో 71వ గణతంత్ర దినోత్సవ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. దేశ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబిస్తూ కళాకారుల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. వేడుకల్లో వివిధ రాష్ట్రాల శకటాల ప్రదర్శన ఆహూతులను మంత్రముగ్ధుల్ని చేసింది.
తెలంగాణ నుంచి చోటు దక్కించుకున్న బతుకమ్మ పండుగ శకటం.... చూపరులను కనువిందు చేసింది. సమ్మక్క, సారలమ్మ జాతర వైభవం, ఆదివాసీల గుస్సాడీ, లంబాడీల నృత్య ప్రదర్శనలు... బతుకమ్మ శకటానికి మరింత వన్నె తెచ్చాయి.
ఇవీచూడండి: ఆర్టీసీ కార్గో సేవలకు ముహూర్తం ఖరారు.