ETV Bharat / state

Congress leaders meet: కాంగ్రెస్‌ సీనియర్ నేతల కీలక భేటీ.. పార్టీలో పరిణామాలపై చర్చ - మర్రి శశిధర్ రెడ్డి

Congress leaders meet
కాంగ్రెస్‌ సీనియర్ నేతల కీలక భేటీ
author img

By

Published : Mar 14, 2022, 6:10 PM IST

Updated : Mar 14, 2022, 8:42 PM IST

18:08 March 14

Congress leaders meet: కాంగ్రెస్‌ సీనియర్ నేతల కీలక భేటీ.. పార్టీలో పరిణామాలపై చర్చ

Congress leaders meet: తార్నాకలోని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ మంత్రి మర్రి శశిధర్‌ రెడ్డి ఇంట్లో కాంగ్రెస్‌ సీనియర్ నేతలు భేటీ అయ్యారు. హైదరాబాద్​లోని ఆయన నివాసంలో జరిగిన సమావేశంలో పొన్నాల, వీహెచ్‌, కమలాకర్‌రావు, గీతారెడ్డి, శ్రీధర్‌బాబు, జగ్గారెడ్డి, జి.నిరంజన్‌, శ్యామ్‌మోహన్‌ పాల్గొన్నారు.

పీసీసీ నిర్ణయాలు సీనియర్లకు చెప్పకుండా ఏకపక్షంగా వ్యవహరిస్తోందని అసంతృప్తిగా ఉన్నారు. వీరంతా పీసీసీ చీఫ్‌ రేవంత్‌ నిర్ణయాల పట్ల కొంత అసంతృప్తితో ఉన్నారు. ఆ అసంతృప్తితోనే నేతలంతా సమావేశమైనట్లు తెలుస్తోంది. గతంలో ఓసారి మాజీ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల ఇంట్లో సమావేశమై రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు, పీసీసీ తీసుకుంటున్న నిర్ణయాలపై చర్చించారు. తాజా భేటీలో దాదాపు 13 నుంచి 14 మంది సీనియర్‌ నేతలు సమావేశమైనట్టు సమాచారం. మరికొందరు నేతలు కూడా హాజరయ్యే అవకాశం ఉంది.

ఏఐసీసీలో జరుగుతున్న తాజా పరిణామాలతో పాటు రాష్ట్రంలో కాంగ్రెస్‌లో రాజకీయాలపైనా చర్చించినట్లు సమాచారం. నిన్న సీడబ్ల్యూసీలో తీసుకున్న నిర్ణయాలకు మద్దతు తెలపడంతో పాటు పీసీసీ నిర్ణయాలు, కార్యక్రమాలపై చర్చిస్తున్నారు. పీసీసీ చీఫ్‌ ఏకపక్షంగా ముందుకెళ్తున్నట్టు భావిస్తున్న వీరంతా పీసీసీకి తగిన రీతిలో సలహాలు, సూచనలు చేయాలా? లేదంటే అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లాలా అనే యోచనలో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది.

ఐదు రాష్ట్రాల ఎన్నికలపైనే చర్చించాం: శ్రీధర్ బాబు

మర్రి శశిధర్ రెడ్డి మర్యాద పూర్వకంగా పిలిచారని.. సభా సమావేశాలు జరుగుతున్నందున ఒక్కసారి వచ్చిపోవాలని ఆహ్వానించారని మంథని ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు తెలిపారు. ఈ సమావేశంలో పార్టీ బలోపేతం కోసం చర్చ జరిగిందని శ్రీధర్‌బాబు పేర్కొన్నారు. ముఖ్యంగా ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపైనే చర్చించామన్నారు. తనకు వేరే పని ఉన్నందున మధ్యలోనే వెళ్లిపోతున్నట్లు చెప్పారు.

పార్టీలో పరిణామాలపై చర్చించాం: వీహెచ్

సీనియర్ల విషయంలో జరుగుతున్న అవమానాలపై చర్చించినట్లు కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ అన్నారు. దీనిపై అధిష్ఠానం దృష్టికి విషయాలను తీసుకెళ్తామని తెలిపారు.

పార్టీ బలోపేతంపైనే చర్చించాం: మర్రి శశిధర్ రెడ్డి

పార్టీకి పూర్వ వైభవం తీసుకురావాలనే విషయంపైనే చర్చించినట్లు కాంగ్రెస్ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి తెలిపారు. పార్టీలో సంస్థాగతమైన మార్పుల జరగాలని కాంగ్రెస్ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి పేర్కొన్నారు. వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని పార్టీ ఏవిధంగా ప్రజల విశ్వాసం పొందుతుందనే దానిపై నిర్ణయాలు ఉండాలని తెలిపారు. పార్టీ వ్యవహారాలు చూస్తున్న వారు.. పార్టీకి అనుబంధంగా ఉన్నారా లేదా అనేది చూడాలని ఆయన సూచించారు.

సీడబ్ల్యూసీ సమావేశంపై చర్చించాం: జగ్గారెడ్డి

కాంగ్రెస్​కు రెట్టింపు బలం కోసం ఏ విధంగా పని చేయాలనే దానిపై చర్చించినట్లు సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి తెలిపారు. బయట జరుగుతున్నట్లు ఎలాంటి ఊహాగానాలకు తావులేదన్నారు. నిన్న దిల్లీలో జరిగిన సోనియా గాంధీ సమావేశంపై మాట్లాడుకున్నామని వెల్లడించారు. సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీ నాయకత్వం ఉండాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. పార్టీతో కొన్ని సంవత్సరాలుగా అనుబంధంగా కొనసాగుతున్న నేతలంతా చర్చించుకున్నట్లు తెలిపారు. వీహెచ్ చెప్పిన అంశాలు చర్చకు వచ్చాయని.. అవీ పార్టీ అంతర్గత విషయాలని జగ్గారెడ్డి వెల్లడించారు.

ఇదీ చూడండి:

Last Updated : Mar 14, 2022, 8:42 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.