ETV Bharat / state

శివరాత్రి స్పెషల్: శ్రీశైలానికి ఆర్టీసీ ప్రత్యేక బస్సులు - Telangana RTC Provides for special bus for Srisailam because of Mahashivaratri festival

ఈ నెల 21న మహాశివరాత్రి పండుగను పురస్కరించుకొని తెలంగాణ ఆర్టీసీ సమాయత్తం అవుతోంది. హైదరాబాద్ నుంచి శ్రీశైలానికి 315 ప్రత్యేక బస్సులు నడపాలని నిర్ణయించుకున్నట్లు రంగారెడ్డి ఆర్​ఎం వరప్రసాద్ తెలిపారు. ఈ నెల 18 నుంచి 23వరకు బస్సులు నడపనున్నట్లు వెల్లడించారు. ఈ అవకాశాన్ని భక్తులు వినియోగించుకోవాలని సూచించారు.

Telangana RTC Provides for special bus for Srisailam because of Mahashivaratri festival
శ్రీశైలానికి ఆర్టీసీ 315 ప్రత్యేక బస్సులు
author img

By

Published : Feb 17, 2020, 5:23 PM IST

Updated : Feb 17, 2020, 8:35 PM IST

మహాశివరాత్రి నేపథ్యంలో శ్రీశైలానికి వెళ్లే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టామని రంగారెడ్డి ఆర్​ఎం వరప్రసాద్ పేర్కొన్నారు. ఈ సంవత్సరం హైదరాబాద్ నుంచి శ్రీశైలానికి 315 ప్రత్యేక బస్సులు సిద్ధం చేసినట్లు తెలిపారు. 18వ తేదీ నుంచి 23 వరకు బస్సులను నడపనున్నట్లు వెల్లడించారు.

మహత్మగాంధీ బస్టాండ్ నుంచి సూపర్ లగ్జరీలో శ్రీశైలానికి 510, డీలక్స్ 450, ఎక్స్​ప్రెస్ 400 రూపాయలు ఛార్జీలు నిర్ణయించినట్లు పేర్కొన్నారు. నగరంలోని ఇతర ప్రదేశాల నుంచి సూపర్ లగ్జరీ రూ. 550, డీలక్స్ రూ. 480 , ఎక్స్​ప్రెస్ రూ. 430 రూపాయలు ఛార్జీలుగా నిర్ణయించామన్నారు. రద్దీకి అనుగుణంగా మరిన్ని ప్రత్యేక బస్సులను పెంచనున్నట్లు వివరించారు.

ఇదీ చదవండి:ఆ రైల్లోని 64వ సీటు శివుడికే శాశ్వతంగా కేటాయింపు!

Last Updated : Feb 17, 2020, 8:35 PM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.