ETV Bharat / state

TRESA: రెవెన్యూ శాఖలో పదోన్నతులు పూర్తి చేయాలి: ట్రెసా

రెవెన్యూశాఖలో పదోన్నతులు పూర్తి చేయాలని సీఎస్​ సోమేశ్​ కుమార్​కు రెవెన్యూ ఉద్యోగుల సంఘం ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు. సీఎస్​ను కలిసిన ప్రతినిధులు.. కొత్తజోనల్ విధానం ప్రకారం బదిలీలకు అంగీకరించారని తెలిపారు. సెప్టెంబర్‌లో పదోన్నతులు పూర్తి చేసి, బదిలీలు చేస్తామన్నారని చెప్పారు.

TRESA: రెవెన్యూ శాఖలో పదోన్నతులు పూర్తి చేయాలి: ట్రెసా
TRESA: రెవెన్యూ శాఖలో పదోన్నతులు పూర్తి చేయాలి: ట్రెసా
author img

By

Published : Aug 27, 2021, 10:13 PM IST

సెప్టెంబర్ నెలలోనే రెవెన్యూశాఖలోని అన్ని స్థాయిల పదోన్నతులు పూర్తి చేస్తామని, ఆ తర్వాత బదిలీలు చేపడతామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ హామీ ఇచ్చినట్లు రెవెన్యూ ఎంప్లాయీస్ సర్వీసెస్ అసోసియేషన్ - ట్రెసా తెలిపింది. ట్రెసా అధ్యక్షుడు రవీందర్ రెడ్డి, బృందం సచివాలయంలో సీఎస్​ను కలిసి దీర్ఘకాలికంగా పెండింగ్​లో ఉన్న పదోన్నతులు సహా ఇతర సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. కొత్త జోనల్ విధానం ప్రకారం ఉద్యోగుల బదిలీలకు ఐదు ఐచ్చికాలు ఇస్తామని... మండలస్థాయిలో రెవెన్యూ విధుల నిర్వహణకు కేడర్ స్ట్రెంత్ నిర్ధారిస్తామని, జాబ్ చార్ట్ రూపొందిస్తామని సీఎస్ చెప్పినట్లు ట్రెసా నేతలు తెలిపారు.

TRESA: రెవెన్యూ శాఖలో పదోన్నతులు పూర్తి చేయాలి: ట్రెసా
TRESA: రెవెన్యూ శాఖలో పదోన్నతులు పూర్తి చేయాలి: ట్రెసా

కొత్త జోనల్ విధానానికి అనుగుణంగా ఉద్యోగుల విభజన త్వరలో కొలిక్కి రానున్నందున రెవెన్యూ శాఖలో పెండింగ్​లో ఉన్న పదోన్నతులను సెప్టెంబర్​లో పూర్తి చేస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపారు. వీఆర్​వోలను త్వరలోనే సర్దుబాటు చేస్తామని, వీఆర్ఏల వేతన స్కేలు సమస్య త్వరలోనే పరిష్కారం అవుతుందని చెప్పినట్లు ట్రెసా నేతలు తెలిపారు. కంప్యూటర్ ఆపరేటర్ల సమస్యలు, కార్యాలయ బడ్జెట్ వంటి ఇతర పెండింగ్ సమస్యలను కూడా త్వరలో పరిష్కరిస్తామన్నారన్న నేతలు.. ధరణి పోర్టల్ ద్వారా నూతనంగా వచ్చిన ఆప్షన్స్ ప్రకారం భూసమస్యలు సకాలంలో పరిష్కరించేందుకు రెవెన్యూ ఉద్యోగులు మరింత కృషి చేయాలని సీఎస్ సూచించినట్లు తెలిపారు.

ఇదీ చదవండి: పాఠశాలల్లో ఉపాధ్యాయ పోస్టుల వర్గీకరణ పూర్తి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.