ఉద్యమ ఆకాంక్షల సాధన కోసం... తెలంగాణ రాష్ట్రీయ లోక్‌దళ్ పార్టీ పని చేస్తుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు దిలీప్‌కుమార్ అన్నారు. కలిసి కొట్లాడుదాం.. కలలుగన్న తెలంగాణను సాధించుకుందాం.. అనే నినాదంతో ముందుకెళ్తామని పేర్కొన్నారు.
హిమాయత్ నగర్లో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో టిఆర్ఎల్డీ పార్టీ మిలిటెంట్ తరహా ఉద్యమాలు చేసిందని ఆయన గుర్తుచేశారు. తెలంగాణ రాష్ట్రం అవిర్భవించాక అనుకున్న లక్ష్యాలను సాధించలేకపోయామనే అసంతృప్తి ప్రతి ఒక్క ఉద్యకారుడిలో ఉందని ఆయన పేర్కొన్నారు.
ఆ లక్ష్యాల సాధన కోసం టిఆర్ఎల్డీ ప్రజా ఉద్యమాలతో ముందుకు వెళ్తుందన్నారు. కేంద్రం ప్రవేశపెట్టిన నూతన విద్యావిధానం, లాక్డౌన్ కారణంగా ప్రైవేట్ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలపై... ఈ నెల 20న కాచిగూడలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నామన్నారు.
- ఇదీ చదవండి: ఆ విద్యార్థి కోసం భారత్-నేపాల్ వంతెన రీఓపెన్