నీతి ఆయోగ్ ప్రకటించిన సుస్థిరాభివృద్ధి సూచికలో తెలంగాణ 11వ స్థానంలో నిలిచింది. గత సంవత్సరం ఐదో స్థానం. గురువారం నీతి ఆయోగ్ వైస్ ఛైర్మన్ రాజీవ్‌కుమార్, సీఈఓ అమితాబ్ కాంత్‌లు సుస్థిర అభివృద్ధి సూచిక డ్యాష్‌బోర్డును ఆవిష్కరించడంతో పాటు 2020 నివేదికను విడుదల చేశారు. ఐక్యరాజ్య సమితి నిర్దేశించిన సుస్థిర అభివృద్ధి సూచికల్లో రాష్ట్రాలు సాధించిన పురోగతిని వెల్లడిస్తూ 2018 నుంచి నీతి ఆయోగ్ నివేదికలు విడుదల చేస్తోంది.అందులో భాగంగా ఈసారి మూడో నివేదికను వెల్లడించింది.
2018లో 13 లక్ష్యాలు, 62 సూచికల ఆధారంగా రాష్ట్రాల పనితీరును వెల్లడించగా.. ఇప్పుడు 16 లక్ష్యాలు, 115 సూచికల ఆధారంగా నివేదికను విడుదల చేశారు. ఈ లక్ష్యాల్లో రాష్ట్రాల పనితీరును ఆధారంగా చేసుకొని 0-100 మార్కులు ప్రకటించారు. 100 మార్కులు సాధిస్తే 2030 లక్ష్యాన్ని ముందే సాధించిన కార్యసాధక రాష్ట్రంగా ప్రకటిస్తున్నారు.
అగ్రస్థానంలో కేరళ
75 మార్కులతో కేరళ అగ్ర రాష్ట్రంగా నిలిచింది. 74 మార్కులతో హిమాచల్‌ప్రదేశ్, తమిళనాడులు రెండో స్థానాన్ని, 72మార్కులతో ఆంధ్రప్రదేశ్, గోవా, కర్ణాటక, ఉత్తరాఖండ్‌లు మూడోస్థానాన్ని పంచుకున్నాయి. తెలంగాణ 69 మార్కులు పొందింది. 52 మార్కులతో బిహార్ చిట్టచివరి స్థానానికి పరిమితమైంది. కేంద్ర పాలిత ప్రాంతాల్లో చండీగఢ్ 79 మార్కులతో అగ్రస్థానాన్ని పొందింది.
ఒక్క విభాగంలోనే 100 మార్కులు
16 లక్ష్యాల్లో తెలంగాణ ఒక్క అందుబాటు ధరల్లో, నాణ్యమైన ఇంధన లభ్యత విభాగంలోనే 100 మార్కులు సాధించింది. 15 రాష్ట్రాలతో కలిసి మొదటి స్థానంలో నిలిచింది. మిగిలిన ఏ విభాగంలోనూ అగ్రస్థానం సాధించలేదు. మొత్తంమీద 11వ స్థానంలో నిలిచినప్పటికీ విభాగాల వారీగా చూసినప్పుడు 4 అంశాల్లో మాత్రమే టాప్-5లో నిలిచింది. మిగిలిన అన్ని విభాగాల్లో 10-23 స్థానాలకు పరిమితమైంది. మిషన్ భగీరథ పథకం కారణంగా గ్రామాలకు రక్షితనీరు అందించడంతో ఆ విభాగంలో రెండో స్థానంలో నిలిచింది. గోవా మొదటి స్థానం పొందింది.
విద్య నాణ్యత, గౌరవప్రదమైన పని, ఆర్థికాభివృద్ధి, పరిశ్రమలు(ఇండస్ట్రీ), వినూత్న ఆలోచనలు (ఇన్నోవేషన్), మౌలిక సదుపాయాలు(ఇన్‌ఫ్రాస్ట్రక్చర్), అసమానతల తగ్గింపు, పర్యావరణ పరిరక్షణకు కార్యాచరణ, భూమిపై జీవనం, శాంతి, న్యాయం, బలమైన వ్యవస్థల విభాగాల్లో గత ఏడాదితో పోలిస్తే మార్కులు తగ్గాయి. ¥ల్లో 20, ఆ తర్వాతి స్థానాల్లో నిలిచింది.
![](https://assets.eenadu.net/article_img/gh-main15b_1.jpg)