ETV Bharat / state

Telangana Rains : సినుకు సినుకు సితారే.. వాగూ వంకా పొంగెనే - వర్షాకాలంపై అవగాహన కార్యక్రమంపై వైద్య శిబిరం

Telangana Rain Problems : రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల్లో వాన జోరు తగ్గినా.. దాని ప్రభావం మాత్రం కొనసాగుతోంది. పలు జిల్లాల్లోని చెరువులు నిండుకుండలా మారి అలుగుపోస్తున్నాయి. ఉరకలెత్తుతున్న వాగుల ఉద్ధృతికి అనేక రహదారులపై నీళ్లు చేరి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ప్రధానంగా ఏజెన్సీ పల్లెవాసులు తిప్పలు పడుతున్నారు. గోదావరి ప్రవాహ ఉద్ధృతితో ముంపు ప్రాంతాల్లో అధికారులు ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టారు. హైదరాబాద్‌లో వర్షం తీవ్రత తగ్గినా.. లోతట్టు ప్రాంతాల ప్రజలను ముంపు భయం వెంటాడుతోంది.

rains
rains
author img

By

Published : Jul 22, 2023, 7:14 AM IST

Updated : Jul 22, 2023, 8:07 AM IST

రాష్ట్రంలో వర్షం తీవ్రత తగ్గినా.. పొంగిపొర్లుతున్న వాగులు, వంకలు

Telangana Rain Problems 2023 : రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల్లో వర్షాలు తగ్గుముఖం పట్టినా వరద ప్రభావం కొనసాగుతూనే ఉంది. గోదావరి పరీవాహకంలో ఉమ్మడి వరంగల్‌, ఆదిలాబాద్‌, కరీంనగర్‌ జిల్లాల్లో వాగులు, వంకలు పరవళ్లు తొక్కుతుండగా.. చెరువులు జలకళ సంతరించుకున్నాయి. మహబూబాబాద్ జిల్లాలో మున్నేరు, ఆకేరు, పాలేరు, పాకాల, వట్టి వాగులు పొంగిపొర్లుతున్నాయి. బయ్యారం పెద్ద చెరువు అలుగు పారుతోంది. చింతుని గుంపు వద్ద జలపాతం పరవళ్లు తొక్కుతోంది. వట్టి వాగు ఉద్ధృతికి బయ్యారం.. తిమ్మాపురం గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. గార్ల శివారులో పాకాల వాగు పొంగి ప్రవహిస్తుండడంతో రాంపురం ,మద్దివంచ గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. పాకాల వాగుపై వంతెన నిర్మించాలంటూ స్థానికులు మోకాళ్లపై కూర్చొని నిరసన వ్యక్తం చేశారు.

Telangana Rains Today : మహబూబ్​నగర్ ఎర్రకుంట చెరువు, పెద్దచెరువు మినీ ట్యాంక్​బండ్ సహా లోతట్టు ప్రాంతాలను ఆబ్కారీ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ పరిశీలించారు. వరద బాధితులకు పునరావాసం కల్పించాలని అధికారులను ఆదేశించారు. ముంపునకు గురయ్యే అవకాశం ఉంటే, అధికారులకు ముందస్తు సమాచారం ఇవ్వాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అవసరమైన చోట కొత్తనాలాలు నిర్మించి వరద సమస్యకు పరిష్కారం చూపుతామని హామీ ఇచ్చారు. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వానల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి సూచించారు.

Heavy Rains in Telangana : ములుగు జిల్లా వెంకటాపురం మండలంలో మారుమూల గ్రామం సీతారాంపురంలో జిల్లా వైద్యా ఆరోగ్య శాఖాధికారి ఆధ్వర్యంలో వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. వాగును దాటుతూ వెళ్లిన వైద్యసిబ్బంది వర్షాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపైనా అవగాహన కల్పించారు. మరోవైపు భద్రాచలంలో గోదావరి వరదల్లో నాటు పడవలు పెట్టి.. సేవలు అందించబోమని గజ ఈతగాళ్లు స్పష్టం చేశారు. గతేడాది అత్యవసర సేవలకు వినియోగించుకున్న అధికారులు ఇంతవరకు ఆ సొమ్ము చెల్లించలేదని వాపోయారు. తమ గోడు జిల్లా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్‌ను కలిసి వెళ్లబోసుకోగా.. పాతబకాయిలు ఇప్పిస్తామని మంత్రి హామీ ఇచ్చారు.

మంచిర్యాల జిల్లా మందమర్రిలో సుబాన్ త్రుటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. సారంగపల్లికి చెందిన యువకుడు శంకరపల్లి సమీపంలోని పాలవాగు దాటుతుండగా వరద ఉద్ధృతికి ద్విచక్రవాహనంతో సహా అదుపుతప్పి అందులో పడిపోయాడు. చెట్టును పట్టుకొని ఒడ్డుకు చేరుకున్నాడు. గ్రామస్థులు వాగులో కొట్టుకుపోతున్న బైక్‌ను అతి కష్టం మీద బయటకు తీశారు.

Hyderabad Rains Today : హైదరాబాద్‌లోనూ వరణుడు జోరు చూపిస్తున్నాడు. మేడ్చల్ జిల్లా దుండిగల్ పరిధి మల్లంపేట, కొత్తకుంట ప్రాంతంలో వరదలో చిక్కుకున్న 50 కుటుంబాలకు చెందిన 200 మందిని పడవ సాయంతో బయటకు తీసుకొచ్చారు. వర్షానికి‌ ఇళ్లలోకి నీరుచేరి అవస్థలు పడుతున్నారనే సమాచారంతో సహాయకచర్యలు చేపట్టారు. పునరావాస కేంద్రానికి తరలించి భోజనాలు అందించారు. ఎడతెరిపి లేని వర్షంతో సరూర్‌నగర్‌ చెరువులోకి వరద పోటెత్తింది. అప్రమత్తమైన అధికారులు సరస్సు గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తుండగా.. కోదండరాంనగర్‌, వివేకానందనగర్‌, శారదనగర్‌ కాలనీల్లోకి వరద చేరుతోంది. యంత్రాంగం కనీసం ముందస్తు సమాచారం ఇవ్వలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇంటి నుంచి అడుగు బయట పెట్టలేకపోతున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భరించలేని దుర్వాసనతో చిన్నాపెద్దా ఇబ్బందులు పడుతున్నామని ఆరోపిస్తున్నారు.

Heavy Rains in Hyderabad : సికింద్రాబాద్‌ కంటోన్మెంట్, బోయిన్‌పల్లి, తిరుమలగిరి, అల్వాల్, కార్ఖానా ప్రాంతాల్లో ఏకధాటిగా కురుస్తున్న వర్షానికి రోడ్లపైకి మోకాల్లోతున నీరుచేరింది. మురుగు కాల్వలు పొంగిపొర్లడం వల్ల స్థానికులు అవస్థలు పడుతున్నారు. మియాపూర్ చందానగర్ జాతీయ రహదారి జలమయంగా మారింది. మియాపూర్ నుంచి రామచంద్రపురం వెళ్లాలంటే ప్రయాణికులు తిప్పలు పడుతున్నారు.

ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని పశ్చిమ ప్రాంతాల్లో కురిసిన వర్షాలతో జలాశయాల్లో భారీగా వరద నీరు వచ్చి చేరింది. చేవెళ్ల మండలం దేవరంపల్లి వద్ద ఎగువ నుంచి వరద పోటెత్తడంతో ఈసీ వాగు రెండో రోజు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ఈసీ నుంచి భారీగా వరద మూసీలో కలుస్తోంది. పరిగిలోని లఖ్నాపూర్ ప్రాజెక్టులోకి పెద్ద ఎత్తున వరద నీరు చేరింది. నస్కల్ వాగు పొంగడంతో వికారాబాద్- పరిగి రహదారిపై రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పెద్దేముల్ మండలం ఇందూరు గ్రామం జలదిగ్భంధంలో చిక్కుకుంది. అనంతగిరి కొండల్లో జలపాతాలు పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. చాలా ఏళ్ల తర్వాత కొండపై నుంచి వాలుతున్న జలధారలు చూసి సందర్శకులు పరవశించిపోతున్నారు.

ఇవీ చదవండి:

Last Updated : Jul 22, 2023, 8:07 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.