రాష్ట్రంలోని జూనియర్ కళాశాలల్లో పని చేస్తున్న గెస్ట్ లెక్చరర్లను కరోనా పేరుతో రెన్యువల్ చేయడం లేదని పీసీసీ అధికార ప్రతినిధి, తెలంగాణ పీఆర్టీయూ వ్యవస్థాపక అధ్యక్షుడు హర్షవర్ధన్ రెడ్డి ఆరోపించారు. జూనియర్ కళాశాలల్లో ఆన్లైన్ తరగతులు ప్రారంభమైనందున వీరిని వెంటనే రెన్యువల్ చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థులకు వీరు బోధించే సబ్జెక్టుల్లో సందేహాలుంటే ఎవరు తీరుస్తారని ప్రశ్నించారు.
తెలంగాణలోని జూనియర్ కళాశాలల్లో పనిచేస్తున్న గెస్ట్ లెక్చరర్లందరికి మార్చి, ఏప్రిల్ నెలల వేతనాలిచ్చి రెన్యువల్ చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్కు పీసీసీ అధికార ప్రతినిధి హర్షవర్ధన్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు.