PRC Commission for Govt Employees : రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు వేతన సవరణ కోసం ప్రభుత్వం సంఘాన్ని ఏర్పాటు చేసింది. పీఆర్సీ(Telangana PRC) ఏర్పాటుపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. వేతనసవరణ సంఘం ఛైర్మన్‌గా విశ్రాంత ఐఏఎస్ అధికారి ఎన్.శివశంకర్‌ను నియమించారు. మరో విశ్రాంత ఐఏఎస్ అధికారి బి.రామయ్యను కమిషన్‌లో సభ్యునిగా నియమించారు. ఈ మేరకు పీఆర్సీని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు.
-
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 'పే స్కేల్' చెల్లింపు కోసం పే రివిజన్ కమిటీని (పీఆర్సీ) నియమించాలని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. ఈ మేరకు కమిటీ ఛైర్మన్ గా శ్రీ ఎన్. శివశంకర్ (రిటైర్డ్ ఐఎఎస్) ను, సభ్యునిగా శ్రీ బి. రామయ్య (రిటైర్డ్ ఐఎఎస్) ను నియమిస్తూ @TelanganaCS…
— Telangana CMO (@TelanganaCMO) October 2, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 'పే స్కేల్' చెల్లింపు కోసం పే రివిజన్ కమిటీని (పీఆర్సీ) నియమించాలని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. ఈ మేరకు కమిటీ ఛైర్మన్ గా శ్రీ ఎన్. శివశంకర్ (రిటైర్డ్ ఐఎఎస్) ను, సభ్యునిగా శ్రీ బి. రామయ్య (రిటైర్డ్ ఐఎఎస్) ను నియమిస్తూ @TelanganaCS…
— Telangana CMO (@TelanganaCMO) October 2, 2023రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 'పే స్కేల్' చెల్లింపు కోసం పే రివిజన్ కమిటీని (పీఆర్సీ) నియమించాలని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. ఈ మేరకు కమిటీ ఛైర్మన్ గా శ్రీ ఎన్. శివశంకర్ (రిటైర్డ్ ఐఎఎస్) ను, సభ్యునిగా శ్రీ బి. రామయ్య (రిటైర్డ్ ఐఎఎస్) ను నియమిస్తూ @TelanganaCS…
— Telangana CMO (@TelanganaCMO) October 2, 2023
Electricity Employees PRC: విద్యుత్ ఉద్యోగులకు 7 శాతం ఫిట్మెంట్
KCR Confirms PRC Commission : వేతనసవరణ సంఘం ఆరు నెలల్లోపు ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. బాధ్యతలు నిర్వర్తించేందుకు పీఆర్సీకి కావాల్సిన నిధులు, సిబ్బందిని సమకూర్చాలని ఆర్థికశాఖను ఆదేశించింది. ఇదే సమయంలో ప్రభుత్వ ఉద్యోగులకు ఐదు శాతం మధ్యంతర భృతిని కూడా చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
TS PRC Commission : పీఆర్సీ నియమించిందుకు సీఎం కేసీఆర్‌కు టీఎన్జీవో(TNGO) నేతలు కృతజ్ఞతలు తెలిపారు. మధ్యంతర భృతి కూడా ప్రకటించిన ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిజేశారు. త్వరలో కేసీఆర్‌ను కలిసి సమస్యలన్నింటిని పరిష్కరించాలని కోరుతామని టీఎన్జీవో నేతలు పేర్కొన్నారు. పీఆర్సీ, ఐఆర్ ప్రకటించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ట్రెసా అధ్యక్షుడు రవీందర్‌రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. పెండింగ్‌లో ఉన్న 2 డీఏలను కూడా విడుదల చేయాలని కోరారు.
పీఆర్సీ ఏర్పాటు, ఐఆర్ చెల్లించడం శుభపరిణామని మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. ఉద్యోగుల ఆకాంక్షల మేరకు పీఆర్సీ నియమించిన సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు. శాసనసభలో హామీ మేరకు మూడో పీఆర్సీ నియమించారని చెప్పారు. ఉద్యోగుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మరోసారి నిరూపించారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరికి హరీశ్‌రావు శుభాకాంక్షలు తెలియజేశారు.
-
ఉద్యోగుల ఆకాంక్షల మేరకు పే రివిజన్ కమిటీని (పీఆర్సీ) ఏర్పాటు చేయడం, 5 శాతం మధ్యంతర భృతి (ఐఆర్) ని చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించడం శుభపరిణామం. సీఎం కేసీఆర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు.
— Harish Rao Thanneeru (@BRSHarish) October 2, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
9 ఏళ్లలో రెండు పిఆర్సీలు ఇవ్వడంతో పాటు, శాసనసభలో ఇచ్చిన హామీ నిలబెట్టుకుంటూ మూడో పిఆర్సీని… pic.twitter.com/THTXpPFKPL
">ఉద్యోగుల ఆకాంక్షల మేరకు పే రివిజన్ కమిటీని (పీఆర్సీ) ఏర్పాటు చేయడం, 5 శాతం మధ్యంతర భృతి (ఐఆర్) ని చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించడం శుభపరిణామం. సీఎం కేసీఆర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు.
— Harish Rao Thanneeru (@BRSHarish) October 2, 2023
9 ఏళ్లలో రెండు పిఆర్సీలు ఇవ్వడంతో పాటు, శాసనసభలో ఇచ్చిన హామీ నిలబెట్టుకుంటూ మూడో పిఆర్సీని… pic.twitter.com/THTXpPFKPLఉద్యోగుల ఆకాంక్షల మేరకు పే రివిజన్ కమిటీని (పీఆర్సీ) ఏర్పాటు చేయడం, 5 శాతం మధ్యంతర భృతి (ఐఆర్) ని చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించడం శుభపరిణామం. సీఎం కేసీఆర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు.
— Harish Rao Thanneeru (@BRSHarish) October 2, 2023
9 ఏళ్లలో రెండు పిఆర్సీలు ఇవ్వడంతో పాటు, శాసనసభలో ఇచ్చిన హామీ నిలబెట్టుకుంటూ మూడో పిఆర్సీని… pic.twitter.com/THTXpPFKPL
2021లో వేతనాల పెంపు.. సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి అయిదు సంవత్సరాలకొకసారి వేతన సవరణ ఉంటుంది. గతంలో 2018 మే 18వ తేదీన విశ్రాంత ఐఏఎస్ అధికారి సీఆర్ బిస్వాల్ నేతృత్వంలో ఉమామహేశ్వరరావు, మహమ్మద్ అలీ రఫత్‌లతో ఏర్పాటైన పీఆర్సీ కమిషన్.. 2020 డిసెంబర్ 31వ తేదీన రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక అందించింది.
ఈ నివేదికలో ఉద్యోగుల వేతనసవరణ, పదవీ విరమణ వయస్సు పెంపు సహా ఇతర భత్యాలు, తదితరాలపై కమిషన్ తన సిఫారసులను ప్రభుత్వానికి అందించింది. ఆ సిఫారసుల ప్రకారం ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలను మూలవేతనంపై ఏడున్నర శాతం పెంచాలని ప్రతిపాదించింది. దీనిపై ఉద్యోగుల నుంచి తీవ్రస్థాయిలో వ్యతిరేకతలు వచ్చాయి. పెరిగిన ధరలకు అనుగుణంగా ఫిట్మెంట్ ప్రకటించాలని డిమాండ్ చేశారు.
TS Anganwadi Teachers in PRC : అంగన్‌వాడీ ఉపాధ్యాయులకు ప్రభుత్వం శుభవార్త
CM KCR Review : వీఆర్ఏ వ్యవస్థ శాశ్వతంగా రద్దు.. అర్హత ప్రకారం వారికి వివిధ శాఖల్లో సర్దుబాటు