ETV Bharat / state

ప్రజావాణికి పోటెత్తిన జనం - భూ సమస్యలే అధికం - తెలంగాణ ప్రభుత్వం ప్రజావాణి కార్యక్రమం

Telangana Prajavani Program : తెలంగాణలో ప్రజవాణి కార్యక్రమం కొనసాగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు తమ సమస్యలను విన్నవించుకోవడానికి ప్రజాభవన్ బాట పడుతున్నారు. అర్జీదారులు విన్నవించుకుంటున్న సమస్యల్లో ఎక్కువగా భూ సమస్యలే ఉన్నాయని అధికారులు చెబుతున్నారు.

Prajavani Program in Hyderabad
Telangana Prajavani Program
author img

By ETV Bharat Telangana Team

Published : Dec 19, 2023, 2:59 PM IST

Updated : Dec 19, 2023, 3:06 PM IST

Telangana Prajavani Program : ప్రజాసమస్యలపై దరఖాస్తులు స్వీకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమం కొనసాగుతోంది. హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌లో చేపట్టిన ఈ కార్యక్రమానికి రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చారు. ప్రజావాణికి మంత్రి పొన్నం ప్రభాకర్‌ హాజరై వారి వినతులను పరిశీలిస్తున్నారు. కిలోమీటరు దూరం వరకు బారులు తీరిన అర్జీదారులు, తమ సమస్యలపై అధికారులకు ఫిర్యాదులు అందజేశారు.

Huge Complaint to Prajavani Program : పింఛన్లు, ఇల్లు, ఉద్యోగాలు, రవాణా రంగంలో బిల్లులు తగ్గించాలనే వినతులతో పెద్దఎత్తున జనాలు రావడంతో ప్రజాభవన్ ముందు భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వాహనాలను క్రమబద్దీకరించిన పోలీసులు అర్జీదారులకు ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అధిక శాతం ఫిర్యాదులు ధరణి పోర్టల్ వల్ల తమ భూములు పోయాయని, సిట్టింగ్ ఎమ్మెల్యేలు తమ భూములు ఖబ్జా చేశారని, టీఎస్పీఎస్సీపై స్పష్టమైన వైఖరి ప్రకటించాలి అంటూ ప్రభుత్వాన్ని వేడుకున్నవే ఉన్నట్లు సమాచారం.

ప్రజావాణికి ఊహించని స్పందన - అర కిలోమీటర్ వరకు బారులు తీరిన అర్జీదారులు

గత ప్రభుత్వం పరిష్కారం చూపని ప్రజల సమస్యలను ఈ ప్రభుత్వమైనా పరిష్కరిస్తుందన్న నమ్మకంతో వినతి పత్రాలతో ప్రజావాణికి వస్తున్నామని అర్జీదారులు చెబుతున్నారు. చాలా ఏళ్లుగా స్పౌజ్ బదీలలపై ఉద్యోగులు అనేక ధర్నాలు, ర్యాలీలు చేపట్టినా సమస్య తీరకపోవడంతో ప్రజావాణికి వచ్చామని తెలిపారు. ఈ సర్కారైనా తమ సమస్యలు పరిష్కరిస్తుందని ఆశిస్తున్నామని వెల్లడించారు.

ప్రజావాణి - ముఖ్యమంత్రి ముద్ర

Auto Drivers Protest at Praja Bhavan : అదేవిధంగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకంతో తాము నష్టపోతున్నామంటూ ఆటో డ్రైవర్లు వాపోతున్నారు. తమ సమస్యను పరిష్కరించాలని ప్రజా భవన్‌కు పోటెత్తారు. ఆటో యూనియన్ జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు. అందరిని దృష్టిలో ఉంచుకొని ప్రత్యేక పథకాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఉచిత ప్రయాణం వల్ల గిరాకీ లేక తాము భారీగా నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.

"ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఉచిత ప్రయాణం వల్ల మాకు పూడ గడవడం లేదు. ఎవ్వరూ ఆటోలు ఎక్కడం లేదు. దీనిపై ఆధారపడే మేము బతుకుతున్నాం. అప్పులు, ఇంటి రెంట్, పిల్లల ఫీజులు ఇలా ఇప్పుడు అన్నీ భారంగా మారాయి. ప్రభుత్వం మాకు ఏదో ఒక హామీ ఇవ్వాలి. రోజుకు రెండు వందలు కూడా రావడం లేదు. డీజిల్ రెట్లు పెరిగాయి. ఇలాంటి పరిస్థితుల్లో కుటుంబాన్ని పోషించలేకపోతున్నాం." - ఆటో డ్రైవర్లు

ప్రజావాణికి పోటెత్తిన జనం- డబుల్ బెడ్‌రూం, భూ సమస్యలే అధికం

ప్రజావాణి కార్యక్రమానికి భారీ స్పందన - అర కిలోమీటర్ వరకు బారులు తీరిన అర్జీదారులు

Last Updated : Dec 19, 2023, 3:06 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.