Telangana Power Dues Issue : ఆంధ్రప్రదేశ్‌కి విద్యుత్ బకాయిలు చెల్లించాలంటూ.. గతేడాది కేంద్రం జారీ చేసిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ..తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థలు, తెలంగాణ ప్రభుత్వం వేర్వేరు పిటిషన్లు దాఖలుచేశాయి. ఆ పిటిషన్లపై వాదనలు విన్న ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ శ్రవణ్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం 65 పేజీల తీర్పు వెలువరించింది. వివాదం.. రెండు రాష్ట్రప్రభుత్వాల నియంత్రణలో ఉన్న సంస్థలకు సంబంధించినదన్న హైకోర్టు.. సామరస్యపూర్వకంగా ముఖ్యంగా మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించుకోవడం అవసరమని అభిప్రాయపడింది.
Telangana AP Electricity Dues Issue : వివాదాలు వస్తే విద్యుత్ కొనుగోలు ఒప్పందాల్లోని నిబంధనల ప్రకారం తొలుత చర్చలతో.. ఆ తర్వాత ఆర్బిట్రేషన్ ద్వారా పరిష్కరించుకోవాలి. అందుకు ఏపీ ఈఆర్సిని సంప్రదించవచ్చని ఉంది. అంటే రెండు రాష్ట్రాల విద్యుత్ సంస్థల మధ్య.. తలెత్తే వివాదాల పరిష్కరానికి ప్రత్యామ్నాయ సంస్థ ఉన్నట్లే కదా అని హైకోర్టు వ్యాఖ్యానించింది. వివాద పరిష్కారానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యామ్నాయ సంస్థను ఆశ్రయించకుండా.. పునర్విభజన చట్టంలోని సెక్షన్ 92 కింద నేరుగా కేంద్ర ప్రభుత్వాన్ని ఆశ్రయించిందని పేర్కొంది.
Telangana HC On AP Telangana Electricity Dues : చట్టప్రకారం బకాయి ఉన్నట్లు తెలంగాణ అంగీకరించాల్సి ఉందని ధర్మాసనం పేర్కొంది. కేంద్ర హోం శాఖ ఆదేశాల మేరకు రెండు రాష్ట్రాల మధ్య తలెత్తే వివదాల పరిష్కారం కోసం సబ్‌కమిటీ ఏర్పాటుకాగా 2022 ఫిబ్రవరి 17న సమావేశం జరిగిందని పేర్కొంది. పాక్షిక వివాదాల పరిష్కారానికి అంగీకరించబోమని.. పూర్తిస్థాయి పరిష్కారానికే అంగీకరిస్తామని తెలంగాణ తేల్చిచెప్పిన విషయాన్ని గుర్తుచేసింది. అదే ఏడాది జూన్17 నాటి సమావేశంలోనూ బకాయిలను.. తెలంగాణ అంగీకరించలేదని పేర్కొంది.
DISCOM Payment Dues : బకాయిలు చెల్లించకుంటే డిస్కంలకు విద్యుత్ సరఫరా బంద్..!
Extra Power charges: వినియోగదారులకు విద్యుత్ షాక్.. రెండింతల బిల్లు వచ్చిందని ఆవేదన
బకాయిలను సర్దుబాటు చేయరాదని.. తెలంగాణ వైద్యారోగ్య శాఖకు ఆంధ్రప్రదేశ్ నుంచి 12 వేల 500 కోట్లు రావాల్సి ఉందని.. కేంద్రానికి వేర్వేరుగా లేఖలు రాసిందని వివరించింది బకాయిలను తెలంగాణ సంస్థలు అంగీకరించినట్లయితే చెల్లిపులకు పట్టుపట్టవచ్చు. తెలంగాణ అంగీకరించనందున ఆ రాష్ట్రానికి వ్యతిరేకంగా నిర్ణయం తీసుకోరాదని హైకోర్టు ధర్మాసనం అభిప్రాయపడింది.
High Court judgment electricity dues to AP :పునర్వభజన చట్టంలోని సెక్షన్ 92 ప్రకారం మార్గదర్శకాలు జారీచేసేందుకు కేంద్రానికి అధికారాలు ఉంటాయని హైకోర్టు పేర్కొంది. ఐతే చట్టప్రకారం పారదర్శకంగా న్యాయంగా వ్యవహరించాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందని వివరించింది. ఏకపక్షంగా ఉతర్వులు ఇవ్వడం సరికాదని సూచించింది. సెక్షన్ 92లో సహజ న్యాయసూత్రాలకు మినహాయింపు లేదన్న న్యాయస్థానం.. బకాయిలు చెల్లించాలంటూ కేంద్రం అలోచనారహితంగా ఉత్తర్వులు జారీ చేసిందని పేర్కొంది. ఏపీ ముఖ్యమంత్రి రాసిన లేఖ ఆధారంగా కేంద్రం నిర్ణయం తీసుకుందన్న న్యాయస్థానం.. బకాయిలపై సమావేశాలు జరిగినా ఎంత మొత్తం చెల్లించాలని తేల్చలేదని గుర్తుచేసింది.
ఉత్తర్వులు జారీచేసే ముందు.. తెలంగాణకు ఎలాంటి నోటీస్ జారీ చేయకపోవడం సరికాదని అభిప్రాయపడింది. విద్యుత్ వినియోగానికి తెలంగాణ విద్యుత్ సంస్థలు సొమ్ము చెల్లించాలనడంతో సందేహం లేదన్న కోర్టు... ఎంతమొత్తం చెల్లించాలన్న అంశంపై తెలంగాణ వాదన వింటే బాగుండేదని పేర్కొంది. బకాయిలు విద్యుత్ సంస్థలకు చెందిన అంశంకాగా.. అందుకు రాష్ట్ర ప్రభుత్వాన్ని బాధ్యత వహించాలనడం సరికాదని హైకోర్టు అభిప్రాయపడింది. రెండు రాష్ట్రాలు మధ్యవర్తిత్వం ద్వారా ఆ వివాదాన్ని పరిష్కరించుకోవాలని హైకోర్టు సూచించింది.
తెలంగాణపై తీవ్రమైన చర్యలకు దిగొద్దని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు
నష్టాల్లో రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థలు.. కొనుగోలుకు రూ.16 వేల కోట్లు