ETV Bharat / state

'జస్టిస్​ ధర్మాధికారి కమిటీ తీరు ఆంధ్రాకి అనుకూలంగా ఉంది!' - సుప్రీంకోర్డు

విద్యుత్​ ఉద్యోగుల విభజనపై జస్టిస్​ ధర్మాధికారి కమిటీ ఇచ్చిన తుది ఆదేశాలపై సుప్రీంకోర్డులో మళ్లీ పిటిషన్​ దాఖలు చేయాలని తెలంగాణ విద్యుత్​ సంస్థలు నిర్ణయించాయి. తెలంగాణ స్థానికత లేని 586 మంది ఉద్యోగులను రాష్ట్రానికి కేటాయించడం నిబంధనలకు విరుద్ధమంటూ సుప్రీంలో పిటిషన్​ వేయాలని జెన్‌కో, ట్రాన్స్‌కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్‌రావు ఆదేశించారు.

Telangana power companies decide to file a petition in Supreme Court on the orders of Justice dharmadhikari committee
జస్టిస్​ ధర్మాధికారి కమిటీ ఆదేశాలపై సుప్రీంలో పిటిషన్​ దాఖలుకు నిర్ణయం
author img

By

Published : Jun 30, 2020, 7:51 AM IST

తెలుగు రాష్ట్రాల మధ్య విద్యుత్‌ ఉద్యోగుల పంపకాలకు సంబంధించి జస్టిస్‌ ధర్మాధికారి కమిటీ ఇచ్చిన తుది ఆదేశాలపై సుప్రీంకోర్టులో మళ్లీ పిటిషన్‌ దాఖలు చేయాలని తెలంగాణ విద్యుత్‌ సంస్థలు నిర్ణయించాయి. జెన్‌కో, ట్రాన్స్‌కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్‌రావు అధ్యక్షతన సోమవారం సంబంధిత కమిటీ ఆదేశాలపై సమీక్ష నిర్వహించారు

విద్యుత్‌ పంపిణీ సంస్థ(డిస్కం)ల సీఎండీలు జి.రఘుమారెడ్డి, ఎ.గోపాలరావు సహా పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. తెలంగాణ స్థానికత లేని 586 మంది ఉద్యోగులను ఏపీ నుంచి రాష్ట్రానికి కేటాయిస్తూ కమిటీ తాజాగా ఆదేశాలిచ్చింది. అయితే, వారిని ఇక్కడ చేర్చుకోకూడదని సీఎండీలు నిర్ణయించారు.

తెలంగాణ స్థానికత లేకుండా ఆయా ఉద్యోగులను రాష్ట్రానికి కేటాయించడం నిబంధనలకు విరుద్ధమని పేర్కొంటూ సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేయాలని ప్రభాకర్‌రావు ఆదేశించారు. మరోవైపు కరోనా కట్టడికి అన్ని విద్యుత్‌ కార్యాలయాల్లో పక్కాగా శానిటైజేషన్‌ నిర్వహించాలని సూచించారు. విద్యుత్‌ ఉద్యోగుల్లో ఎవరికైనా వైరస్‌ సోకితే ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందించేందుకు వీలుగా నోడల్‌ అధికారిని కూడా నియమించారు.

తెలంగాణకు మరోసారి అన్యాయం

విద్యుత్తు ఉద్యోగుల విభజనలో తెలంగాణకు మరోమారు అన్యాయం జరిగిందని రాష్ట్ర విద్యుత్తు అకౌంట్స్‌ ఆఫీసర్స్‌ అసోసియేషన్‌ (టీఈఏవోఏ) నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్రా యాజమాన్యం, ఉద్యోగుల ఒత్తిళ్లకు తలొగ్గి జస్టిస్‌ ధర్మాధికారి కమిటీ తెలంగాణకు ద్రోహం చేసేలా ఉత్తర్వులు ఇచ్చిందని ఆరోపించారు. సోమవారం సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.అంజయ్య అధ్యక్షతన ఆన్‌లైన్‌లో కేంద్ర కమిటీ సమావేశం జరిగింది. అనంతరం అంజయ్య మాట్లాడుతూ.. ఏపీకి చెందిన 586 మందిని తెలంగాణకు ఏ ప్రాతిపదికన కేటాయించారో అర్థం కావడం లేదన్నారు.

ఇవీ చూడండి: 1 లేదా 2న రాష్ట్ర కేబినెట్ భేటీ? లాక్‌డౌన్‌పై తుది నిర్ణయం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.