ETV Bharat / state

పాలిసెట్‌ ఫలితాలు విడుదల.. ఇలా చెక్​ చేసుకోండి.. - TS POLYCET 2022 Results

పాలిసెట్‌ ఫలితాలు విడుదల
పాలిసెట్‌ ఫలితాలు విడుదల
author img

By

Published : Jul 13, 2022, 12:09 PM IST

11:42 July 13

పాలిసెట్‌ ఫలితాలు విడుదల.. ఇలా చెక్​ చేసుకోండి..

TS POLYCET 2022 Results : తెలంగాణ పాలిసెట్‌ ఫలితాలు విడుదలయ్యాయి. సాంకేతిక విద్యాశాఖ కమిషనర్‌ నవీన్​ మిత్తల్‌ ఫలితాలను విడుదల చేశారు. పాలిసెట్ ఎంపీసీ విభాగంలో 75.73 శాతం ఉత్తీర్ణత సాధించగా.. పాలిసెట్ ఎంబైపీసీ విభాగంలో 75.81 శాతం మంది ఉత్తీర్ణులైనట్లు నవీన్ మిత్తల్ తెలిపారు. పాలిటెక్నిక్ ప్రవేశాలకు నేడు నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు వెల్లడించారు.

జూన్‌ 30న 365 కేంద్రాల్లో ఈ పరీక్షను నిర్వహించగా.. 14,432 మంది విద్యార్థులు హాజరయ్యారు. పాలిటెక్నిక్‌ డిప్లొమా కోర్సులతో పాటు అగ్రికల్చర్‌, వెటర్నరీ, హార్టికల్చర్‌, బాసర ట్రిపుల్‌ ఐటీ ప్రవేశాలను పాలిసెట్‌ ర్యాంకు ఆధారంగా భర్తీ చేయనున్నారు.

ఫలితాలు ఇలా తెలుసుకోండి.. ముందుగా అధికారిక వెబ్​సైట్​ https://polycetts.nic.in/Default.aspx లోకి వెళ్లాలి.

  • అనంతరం అటెన్షన్‌ టు క్యాండిడెట్స్‌లో ‘డౌన్‌లోడ్‌ పాలిసెట్‌ 2022 రిజల్ట్స్‌’ పై క్లిక్‌ చేయాలి.
  • వెంటనే క్యాండిడెట్‌ లాగిన్‌ పేజ్‌లోకి వెళ్తుంది.
  • అక్కడ అభ్యర్థి రోల్‌ నెంబర్‌, డేట్‌ ఆఫ్‌ బర్త్‌ ఎంటర్ చేసి సబ్‌మిట్ బటన్‌ నొక్కాలి.
  • వెంటనే ఫలితాలు స్క్రీన్‌పై ప్రత్యక్షమవుతాయి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.