ETV Bharat / state

Police trace lost cell phones in Telangana : కొత్త సాంకేతికతతో.. మిస్సైన 4226 సెల్‌ఫోన్లను రికవరీ చేసిన పోలీసులు - hyd police trace missing phones

Telangana Police Trace Lost Cell Phones : రాష్ట్రంలో పోయిన సెల్​ఫోన్​లను పోలీసులు ఎక్కడ ఉన్నాయో కనిపెట్టి.. యజమానులకు అందజేస్తున్నారు. ఇదంతా రాష్ట్రంలో ప్రవేశపెట్టిన సెంట్రల్​ ఎక్విప్​మెంట్​ ఐడెంటిటీ రిజిస్ట్రర్​ పోర్టల్​ ద్వారా సాధ్యం అవుతుంది. ఇప్పటి వరకు 4226 సెల్​ఫోన్లు రికవరీ చేసినట్టు పోలీసులు తెలిపారు.

Etv Bharat
Etv Bharat
author img

By

Published : May 22, 2023, 10:56 PM IST

Telangana Police Trace Lost Cell Phones : చోరీకి గురైన, పొగొట్టుకున్న చరవాణులను పోలీసులు కొత్త సాంకేతికత ఉపయోగించి గుర్తిస్తున్నారు. ఇలా నెల రోజుల వ్యవధిలోనే 1,000 సెల్‌ఫోన్లను గుర్తించి, సంబంధిత యజమానులకు అందించారు. సెంట్రల్ ఎక్విప్​మెంట్ ఐడెంటిటీ రిజిస్ట్రర్ పోర్టల్​ను టెలికాంశాఖ గత నెల అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రయోగాత్మకంగా తెలంగాణ రాష్ట్రాన్ని ఎంపిక చేసుకొని ఆ సాంకేతికతను గత నెల 19వ తేదీ నుంచి ఇక్కడ ఉపయోగించారు.

4226 ఫోన్లు రికవరీ చేశారు : సీఐడీ అదనపు డీజీ మహేశ్‌భగవత్ నేతృత్వంలో రాష్ట్రంలో 780 పోలీస్‌స్టేషన్లలో ఈ సాంకేతికతను ఉపయోగిస్తున్నారు. నెల వ్యవధిలో 16,000ల చరవాణులు పోయినట్లు ఫిర్యాదులు రాగా.. అందులో 4,226ఫోన్లను రికవరీ చేశారు. వీటిలో 1,000 మొబైల్ ఫోన్లను యజమానులకు అప్పగించారు. సెల్‌ఫోన్​లు చోరీకి గురైనా లేదంటే ఎక్కడైనా పడేసుకున్నా మీ సేవ, పోలీస్‌స్టేషన్​లకు వెళ్లి ఫిర్యాదు చేసే అవసరం లేకుండా సీఈఐఆర్ పోర్టల్​లో దరఖాస్తు చేసుకోవచ్చని పోలీసులు చెబుతున్నారు.

క్షణాల్లో ఫోన్​ ఎక్కడ ఉందో తెలుస్తుంది : మొబైల్ ఫోన్ కనిపించలేదని కంగారుపడాల్సిన అవసరం లేదు.. పోయిందని బాధ పడాల్సిన పని లేదు. చరవాణి ఎక్కడ ఉన్నా.. క్షణాల్లో అదెక్కడ ఉందో పోలీసులు గుర్తిస్తున్నారు. కేంద్రం ప్రత్యేకమైన రూపొందించిన పోర్టల్‌ను ఉపయోగించి.. లోకేషన్​ని కనిపెడుతున్నారు. దేశవ్యాప్తంగా ఈ పోర్టల్ సేవలను ఈ నెల 17 నుంచి అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ 'https://sancharsaathi.gov.in' అనే వెబ్​ పోర్టల్‌ను సెంటర్ ఫర్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలిమాటిక్స్ తయారు చేసింది.

అప్లికేషన్​ ఎలా నింపాలి : మొబైల్​ పోగొట్టుకున్న వ్యక్తి ముందుగా సంచార్​ సాథీ పోర్టల్​లో అప్లికేషన్​ నింపాల్సిన అవసరం ఉంది. ఫోన్​ నెంబర్​, ఐఎంఈఐ, ఫోన్​ బ్రాండ్​ పేరు, మొబైల్​ పోగోట్టుకున్న ప్రదేశం, తేదీ, జిల్లా, రాష్ట్రం, దగ్గర పోలీస్​ స్టేషన్​, పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేసిన సంఖ్య వీటిని అప్లికేషన్​లో నింపాలి. అనంతరం పోలీస్​ స్టేషన్​ ఫిర్యాదు చేసిన డాక్యుమెంట్​ను అప్​లోడ్​ చేయాలి. ఫోన్​ పోగోట్టుకున్న వ్యక్తి చిరునామా ఇవ్వాలి. చివరిగా క్యాప్చా ఫిల్​ చెయ్యాలి. తరవాత ఒటీపీ వస్తుంది. అది ఎంటర్​ చేస్తే వివరాలు తెలుసుకోవచ్చు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.