అభివృద్ధిలో దేశంలోనే మొదటిస్థానంలో రాష్ట్రం ఉందని శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ తెలిపారు. హైదరాబాద్ చందానగర్ బీహెచ్ఈఎల్ ఎంఐజీలో సీసీ కెమెరాలను మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వరరావుతో కలిసి ఆయన ప్రారంభించారు. రాష్ట్రంలో మరో పదిహేనేళ్ల పాటు ఎటువంటి ఆర్థిక సమస్యలు తలెత్తవని... నిశ్చింతగా ప్రజలు బతకవచ్చని గాంధీ అన్నారు.
భారత్లోని ఇతర రాష్ట్రాల కంటే తెలంగాణ అభివృద్ధిలో తొలిస్థానంలో ఉందని... ప్రజలు సామరస్యంగా ఉండటం వల్లే ఇది సాధ్యమైందన్నారు. మన పోలీస్ వ్యవస్థ పటిష్ఠంగా పనిచేస్తూ రాష్ట్రంలో నేరాలు జరగకుండా నియంత్రిస్తుందని వెల్లడించారు.
నేరాలను నియంత్రించాలంటే సీసీ కెమెరాలు తప్పనిసరని మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వరరావు స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరు నేర రహిత సమాజం కోసం తోడ్పడాలని కోరారు. భద్రత, సంక్షేమం విషయంలో ప్రభుత్వం తీసుకునే చర్యల ద్వారా హైదరాబాద్ ప్రపంచంలోని ఇతర నగరాల కంటే బెస్ట్ సిటీగా నిలిచిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ వెంకటేశ్వర్లు, ఏసీపీ కృష్ణ ప్రసాద్, కార్పొరేటర్ సింధు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: 'ప్రపంచానికి భారత్ ఇచ్చిన గొప్ప బహుమతి... ఆధ్యాత్మికత'