మావోయిస్టు పార్టీ అమరవీరుల వారోత్సవాల (జులై 28 నుంచి ఆగస్టు 3 వరకు) నేపథ్యంలో రాష్ట్ర పోలీసులు అప్రమత్తమయ్యారు. ఉత్తర తెలంగాణ సరిహద్దు ప్రాంతాలపై కన్నేసి ఉంచారు. అక్కడి ప్రజాప్రతినిధులు, ముఖ్యనేతలు సురక్షిత స్థలాల్లో ఉండాలని సూచిస్తున్నారు. ఈసారి గోదావరి, ప్రాణహిత, ఇంద్రావతి నదుల ఉద్ధృతి దృష్ట్యా కొన్ని ప్రాంతాలకే వారి కార్యకలాపాలు పరిమితం కావొచ్చని పోలీసులు అంచనా వేస్తున్నారు.
భద్రాద్రి జిల్లా చర్ల, దుమ్ముగూడెం మండలాలతో పాటు ములుగు జిల్లా వాజేడు, వెంకటాపురం మండలాల్లో కదలికలు ఉండొచ్చని భావిస్తున్నారు. ఈ మండలాలు గోదావరికి అవతల.. ఛత్తీస్‌గఢ్ నుంచి రాకపోకలకు అనువుగా ఉండటమే ఇందుకు కారణం. మావోయిస్టు పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా పనిచేసిన హరిభూషణ్ ఇటీవలే అనారోగ్యంతో మృతిచెందడంతో దామోదర్ అలియాస్ చొక్కారావు ఇన్‌ఛార్జిగా ఉన్నాడు. దూకుడుగా వ్యవహరిస్తాడనే పేరుండటంతో వారోత్సవాల్లో ఉనికి చాటుకునేందుకు యత్నించవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.
ఇదీ చూడండి: Dalit Bandhu: 'దళితబంధు పథకం'పై నేడు అవగాహన సదస్సు