సీనియర్ ఐపీఎస్ అధికారి వీకే సింగ్ తన పదవికి రాజీనామా చేశారు. గాంధీ జయంతి రోజున పదవీ విరమణ ఇవ్వాలని వీకే సింగ్ కేంద్రాన్ని కోరారు. పోలీస్ శాఖలో ఎన్నో సంస్కరణలు తేవాలనే ఆశయం తనకు ఉండేదన్నారు. సంస్కరణల అమలులో సఫలం కాలేకపోయానని ఆవేదన వ్యక్తంచేశారు. తన సర్వీస్ పట్ల ప్రభుత్వం సంతృప్తిగా లేనట్టుందని వీకే సింగ్ అభిప్రాయపడ్డారు. ప్రభుత్వానికి తాను భారం కాదల్చుకోలేదని పేర్కొన్నారు. ప్రభుత్వంలో కంటే బయటే తన సేవలు అవసరమన్నారు. తాను ఏ ప్రభుత్వానికి వ్యతిరేకం కాదని స్పష్టంచేశారు.
ఇదీ చూడండి : తెలంగాణలో పదివేలు దాటిన కరోనా కేసుల సంఖ్య