ETV Bharat / state

ముగిసిన సహకార పోలింగ్​... కాసేపట్లో ఓట్ల లెక్కింపు.. - Telangana PACS elections 2020 polling close

రాష్ట్ర వ్యాప్తంగా సహకార సంఘాల ఎన్నికల పోలింగ్​ ముగిసింది. స్వల్ప ఘటనలు మినహా.. పోలింగ్ ప్రశాంతంగా సాగింది. మధ్యాహ్నం రెండు గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది.

Telangana  PACS elections polling close
Telangana PACS elections polling close
author img

By

Published : Feb 15, 2020, 1:00 PM IST

Updated : Feb 15, 2020, 3:05 PM IST

రాష్ట్ర వ్యాప్తంగా 905 సహకార సంఘాల ఎన్నికలకు అధికారులు నోటిఫికేషన్​ విడుదల చేశారు. ఏకగ్రీవంగా 157 సంఘాల్లో ఎన్నికలు పూర్తయ్యాయి. మిగిలిన 748 సంఘాలకు ఇవాళ జరిగిన ఎన్నికల పోలింగ్​ ముగిసింది. మెుత్తంగా 80 శాతం పోలింగ్ నమోదైంది. అక్కడక్కడ చిన్న చిన్న ఘటనలు మినహా పోలింగ్​ ప్రశాంతంగా సాగింది.

నిజామాబాద్ జిల్లా ఇందల్వాయిలో పోలీసులు ఒక వర్గానికి అనుగుణంగా వ్యవహరిస్తున్నారని రైతులు ఆందోళనకు దిగారు. ఖమ్మం జిల్లా బోరోలులో ఎమ్మెల్యే ఉపేందర్ రెడ్డి, మాజీ మంత్రి తుమ్మల వర్గీయుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. నల్గొండ జిల్లా హాలియాలోని కొత్తపల్లి కేంద్రంలో ఓ రైతుపై ఎస్​ఐ వీర రాఘవులు చేయిచేసుకోవడంతో కాసేపు ఉద్రిక్తత నెలకొంది.

పోలింగ్ ముగిసినందున.. అధికారులు ఓట్ల లెక్కింపునకు సిద్ధమయ్యారు. భోజనం అనంతరం.. 2 గంటల నుంచి లెక్కింపు ప్రారంభం కానుంది. సాయంత్రానికల్లా ఫలితాలు వెల్లడించి విజేతలకు ఎన్నికల అధికారులు గెలుపు ధ్రువీకరణ పత్రాలు అందజేయనున్నారు.

ఇవీ చూడండి:రేపు సాయంత్రం రాష్ట్ర మంత్రి వర్గ సమావేశం

Last Updated : Feb 15, 2020, 3:05 PM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.