.
ఆర్టీసీ సమ్మెపై ప్రయాణికుల ఆందోళన - telangana normal public protest about RTC Strike at Hyderabad
హైదరాబాద్ మలక్పేట్ సమీపంలోని నల్గొండ క్రాస్ రోడ్ వద్ద ప్రయాణికులు ఆందోళనకు దిగారు. ఆర్టీసీ సమ్మెపై ప్రభుత్వం మెుండి వైఖరి అవలంభిస్తున్నదని మండిపడ్డారు. గంటల తరబడి బస్సు కోసం ఎదురు చూస్తున్న రాకపోవడం వల్ల ఆవేశానికిలోనైనా ప్రయాణికులు నడ్డిరోడ్డుపై బైఠాయించి... నిరసన వ్యక్తం చేశారు. ఫలితంగా కాసేపు ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. సమ్మె వల్ల సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురైతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించి.... ప్రజా రవాణాకు ఇబ్బంది కలగకుండా చూడలని విజ్ఞప్తి చేశారు.
telangana normal public protest about RTC Strike at Hyderabad
.
sample description