ETV Bharat / state

Telangana News Today టాప్​న్యూస్ 11AM - Telangana News Today

ఇప్పుటివరకు ఉన్న ప్రధానవార్తలు

TOP NEWS 11AM
TOP NEWS 11AM
author img

By

Published : Aug 20, 2022, 10:59 AM IST

  • మునుగోడు ఉపఎన్నికలో తెరాసకు సీపీఐ మద్దతు

మునుగోడు గద్దెను ఎలాగైనా దక్కించుకోవాలనుకుంటున్న అధికార తెరాస సీపీఐని మద్దతు కోరింది. ముఖ్యమంత్రి కేసీఆర్‌తో ప్రగతిభవన్‌లో సమావేశమైన సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడవెంకట్ రెడ్డి ఉపఎన్నికలో తెరాసకు మద్దతివ్వాలని నిర్ణయించారు. రాష్ట్రంలో ఏ ఎన్నికలు వచ్చినా తెరాసకు మద్దతు ఉంటుందని సీపీఐ చెప్పినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. మునుగోడులో ఇవాళ జరగనున్న కేసీఆర్ బహిరంగ సభకు సీపీఐ నేతలు హాజరుకానున్నారు.

  • మోయలేనంత రుసుం, చెల్లించకపోతే జులుం

మనం పడే కష్టాలు మన పిల్లలు పడొద్దు.. ఒళ్లు హూనం చేసుకొనైనా కష్టపడి పిల్లలను ప్రైవేటు, కార్పొరేట్‌ విద్యాసంస్థల్లో చదివిద్దాం.. ఫీజులు మోయలేనంత భారమైనా అప్పోసప్పో చేసి చెల్లిద్దామని తల్లిదండ్రులు భావిస్తున్నారు. కానీ రాష్ట్రంలో కొన్ని ప్రైవేటు, కార్పొరేట్‌ కళాశాలలు ఎప్పుడైనా పరిస్థితులు తారుమారైన సమయంలో కొద్దోగొప్పో కట్టకపోతే సర్టిఫికెట్లు నిలిపేయడం చేస్తున్నాయి తాజాగా రామంతాపూర్‌ నారాయణ కళాశాలలో చోటుచేసుకున్న ఘటన తీవ్ర చర్చనీయాంశమైంది.

  • టాబ్లెట్​ షీట్​పై వెడ్డింగ్​ కార్డు, క్రియేటివిటీ అదుర్స్​ కదా

ఒక్కొక్కరిది ఒక్కో ఆలోచన, ఏం చేసినా వెరైటీ, సమ్​థింగ్ స్పెషల్​గా ఉండాలనేది నేటి యువత ఆలోచన. ఈ కోవకే చెందిన ఓ డాక్టర్​ తన పెళ్లికి పిలవడానికి బంధువుల ఇంటికి వెళ్లాడు. వెంటనే ఓ టాబ్లెట్ షీట్ తీసి ఇచ్చాడు. అది అందుకున్న వారు ఇదేంటి బాబు అని అడగ్గా, ఇది తన పెళ్లి శుభలేఖ అని చెప్పాడు. వెంటనే అవతలి వారికి దిమ్మతిరిగింది. ఒకటికి రెండు సార్లు చూస్తే కానీ తెలియలేదు అది వెడ్డింగ్​ కార్డు అని.

  • భారత్​లో ఒక్కరోజే 13000 మందికి కరోనా

India Covid Cases: దేశంలో కొవిడ్​ కేసులు ఆందోళనకరంగా నమోదవుతున్నాయి. శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి శనివారం ఉదయం 8 గంటల వరకు 13,272 మందికి కరోనా వైరస్‌ సోకినట్లు నిర్ధరణ అయింది. మరో 36 మంది కరోనాతో మరణించగా.. 13,900 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రికవరీ రేటు 98.58 శాతం వద్ద స్థిరంగా ఉంది. యాక్టివ్ కేసులు 0.23 శాతం, డైలీ పాజిటివిటీ రేటు 4.21 శాతానికి పెరిగాయి.

  • ముంబయికి బెదిరింపులు, ఉగ్ర దాడులు చేస్తామని పాక్​ నుంచి మెసేజ్​

దేశ ఆర్థిక రాజధాని ముంబయిపై ఉగ్ర దాడులు చేస్తామని బెదిరింపు సందేశం వచ్చింది. ఈ మేరకు ముంబయి పోలీస్​ ట్రాఫిక్​ కంట్రోల్​ రూంకు ఒక మెసేజ్​ వచ్చినట్లు వారు వెల్లడించారు. 26/11 ఉగ్రదాడి తరహాలో విరుచుకుపడతామని, మొత్తం ఆరుగురు భారత్​లో ఈ ప్రణాళికలో భాగం అయ్యారని అందులో ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు. ఈ మెసేజ్​ పాకిస్థాన్​ నుంచి వచ్చినట్లు భావిస్తున్నారు. ప్రస్తుతం విచారణ జరుపుతున్నట్లు తెలిపారు.

  • తెలంగాణలో మావోయిస్టుల కదలిక, తప్పిన భారీ ఎన్​కౌంటర్​

Maoists Movement in Telangana ఏడాది కాలం పాటు నిశబ్దంగా ఉన్న రాష్ట్రంలో మావోయిస్టు మళ్లీ దళాల సంచారం మెుదలైంది. రాష్ట్ర సరిహద్దుల్లో మరోసారి దళాల అలికిడి కలకలం సృష్టిస్తోంది. ములుగు-భద్రాద్రి జిల్లాల సరిహద్దుల్లో భారీ ఎన్​కౌంటర్​ ముప్పు తప్పిందని పోలీసులు చెబుతున్నారు. మావోయిస్టుల కదలికతో అప్రమత్తమయ్యామని వెల్లడించారు.

  • ఫోన్లో ఎక్కువ సేపు గడుపుతున్నాడని గన్​తో కాల్చిన తండ్రి

పని నుంచి వచ్చేసరికి ఫోన్​తో ఆడుకుంటూ కనిపించడం వల్ల కోపోద్రిక్తుడైన తండ్రి, కుమారుడిని మందలించాడు. మొబైల్​ ఫోన్​కు బానిసయ్యాడని గన్​తో కాల్చాడు. ఈ ఘటన గుజరాత్​ కామ్రేజ్​ పరిసర ప్రాంతమైన వవ్​ గ్రామంలో జరిగింది.

  • పాక్​తో మ్యాచ్​పై రోహిత్​ వ్యాఖ్యలు, పరిస్థితులకు అలవాటుపడితేనే

Rohit Sharma Pakistan Match గతేడాది దుబాయ్​లో పాక్​తో ఆడినప్పుడు తమకు అనుకూలంగా ఫలితం రాలేదని, కానీ భారత్​ ఇప్పుడు భిన్నంగా ఆడుతోందని అన్నాడు కెప్టెన్​ రోహిత్​ శర్మ. తన వరకు క్రికెట్​ ముఖ్యమని, ఫలానా ఫార్మాట్​కు ఆదరణ తగ్గిందని ఎప్పుడూ చెప్పనని అన్నాడు టీమ్​ఇండియా కెప్టెన్​ రోహిత్​ శర్మ.

  • యూపీఐ పేమెంట్లపై ఛార్జీలు, ప్రజాభిప్రాయం కోరిన ఆర్‌బీఐ

ప్రస్తుత రోజుల్లో జేబులో రూపాయి లేకపోయినా పర్లేదు, బ్యాంక్‌ ఖాతాలో నగదు ఉండి చేతిలో మొబైల్‌ ఉంటే చాలు. ధైర్యంగా దుకాణాలకు వెళ్లి యూపీఐ ద్వారా క్యూఆర్‌ కోడ్‌ను స్కాన్‌ చేసి డబ్బులు పంపి ఏం కావాలన్నా కొనుక్కుంటున్నాం. అయితే యూపీఐ లావాదేవీలపైనా ఛార్జీలను వసూలు చేసేందుకు ఆర్‌బీఐ పరిశీలిస్తోంది. ఈ నిర్ణయంపై ప్రజాభిప్రాయం తెలియజేయాల్సిందిగా కోరుతోంది.

  • మెగాస్టార్​ మంచి మనసు, ఈ సారి సినీ కార్మికుల కోసం

Chiranjeevi Promises to build hospital మెగాస్టార్​ చిరంజీవి మరోసారి తన మంచి మనసును చాటుకున్నారు. ఇప్పటికే బ్లడ్‌ బ్యాంక్‌ స్థాపించడం సహా ఎన్నో సేవా కార్యక్రమాల్లో పాల్గొని తన వంతు సాయం చేస్తున్న చిరు, ఈ సారి సినీకార్మికుల కోసం ఓ ఆస్పత్రి కట్టించనున్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.