ETV Bharat / state

వెలువడుతున్న ఫలితాలు.. అత్యధిక స్థానాల్లో తెరాస విజయభేరీ..

రాష్ట్ర పురపాలక, నగరపాలక సంస్థల ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. ఉదయం 9.30 గంటల వరకు 161 స్థానాల ఫలితాలు వెల్లడయ్యాయి. ఇప్పటివరకు వెల్లడైన అత్యధిక స్థానాల్లో తెరాస విజయం సాధించింది.

author img

By

Published : Jan 25, 2020, 10:05 AM IST

telangana municipal elections results
ప్రశాంతంగా సాగుతున్న మున్సిపల్ ఓట్ల లెక్కింపు ప్రక్రియ

తెలంగాణ పురపాలక, నగరపాలక ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం 9.30 గంటల వరకు తెరాస 126, కాంగ్రెస్​ 15, భాజపా 5, ఎంఐఎం 5 స్థానాల్లో విజయం సాధించింది.

ఇప్పటి వరకు మొత్తం 161 స్థానాల ఫలితాలు వెల్లడయ్యాయి. బొల్లారం, సత్తుపల్లి మున్సిపాలిటీలను అధికార పార్టీ గెలుచుకుంది. పూర్తి ఫలితాలు రాకపోయినా.. మెజార్టీ స్థానాలు కైవసం చేసుకుంది.

ఎన్నికల అధికారులు, జిల్లా కలెక్టర్లు ఎప్పటికప్పుడు లెక్కింపు కేంద్రాలను పర్యవేక్షిస్తున్నారు. కౌంటింగ్​ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు.

Intro:Body:Conclusion:

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.