.
ముగిసిన మున్సిపల్ ఎన్నికల ప్రచారం
హోరాహోరీగా సాగిన మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి తెరపడింది. పట్టణాల్లో మారుమోగుతున్న డప్పు చప్పుళ్లు, నినాదాల హోరు, కళాకారుల గొంతులు మూగబోయాయి. మైకులు బంద్ అయ్యాయి. పుర ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న అధికార పక్షంతో పాటు ప్రధాన ప్రతిపక్షాల.. విమర్శలు, ప్రతి విమర్శలు ఆగిపోయాయి. సభలు, సమావేశాలు సమాప్తమయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా 120 మున్సిపాలిటీలు,9 కార్పొరేషన్లకు ఈనెల 22న పోలింగ్ జరగనుంది. పోటీలో ఉన్న అభ్యర్థుల భవితవ్యం ఈనెల 25న తెలనుంది. అధికారులు ఇప్పటికే పోలింగ్ ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. అభ్యర్థులు గెలుపు కోసం... తెర చాటు ప్రయత్నాలు ఊపందుకోనున్నాయి. అభ్యర్థులందరికీ ఈ కాస్త సమయమే చాలా కీలకం.
telangana municipal election 2020 campaign close
.