ETV Bharat / state

Saree in the Matchbox: 'అగ్గిపెట్టెలో చీర అభినందనీయం.. నేతన్నలకు అండగా ఉంటాం' - minister ktr visited Saree in Matchbox

Saree in the Matchbox: నేతన్నలకు రాష్ట్ర ప్రభుత్వం ఉండగా ఉంటుందని మంత్రి కేటీఆర్​ అన్నారు. ఈ మేరకు అగ్గిపెట్టెలో పట్టే చీరను నేసిన నేత కార్మికుడు విజయ్​ను మంత్రులు కేటీఆర్​, ఎర్రబెల్లి, సబిత, శ్రీనివాస్​ గౌడ్ అభినందించారు. మంగళవారం... హైదరాబాద్​లో మంత్రులను కలిసిన విజయ్​.. ఆ చీరను మంత్రి సబితకు బహుకరించారు.

Saree in Matchbox
అగ్గిపెట్టెలో చీర
author img

By

Published : Jan 12, 2022, 2:23 PM IST

Saree in the Matchbox: నేత సంప్రదాయాన్ని కొనసాగిస్తూ అగ్గిపెట్టెలో పట్టే చీరను నేసిన సిరిసిల్లకు చెందిన నల్ల విజయ్​ను మంత్రులు అభినందించారు. హైదరాబాద్​లో మంత్రులు కేటీఆర్, ఎర్రబెల్లి దయాకర్​రావు, సబితా ఇంద్రారెడ్డి, శ్రీనివాస్ గౌడ్ సమక్షంలో విజయ్ కుటుంబసభ్యులతో కలిసి చీరను ప్రదర్శించారు. యువ నేతన్న విజయ్ నేసిన చీరకు మంత్రులు ప్రశంసలు కురిపించారు. చీరకు సంబంధించిన నేత ప్రక్రియ, ఇతర వివరాలను అడిగి తెలుసుకున్నారు.

అగ్గిపెట్టెలో పట్టే చీర గురించి వినడమే కానీ తొలిసారి చూస్తున్నామన్న మంత్రులు... ఇంత అద్భుతమైన చీర నేసిన విజయ్​ను మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రత్యేకంగా ప్రశంసించారు. తాను నేసిన చీరను మంత్రి సబితకు విజయ్ అందించారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలతో సిరిసిల్లలోని నేత రంగంలో ఇప్పటికే అనేక మార్పులు వచ్చాయన్న విజయ్​.. సిరిసిల్ల నేతన్నలు ఆధునిక మరమగ్గాలు, పద్ధతుల వైపు వెళ్తున్నారని చెప్పారు. ప్రస్తుతం తాను నేసిన చీరను సైతం మరమగ్గాలపై మూడు రోజుల్లోనే నేసే అవకాశం ఉందని, అదే చేతితో అయితే రెండు వారాల సమయం పడుతుందని విజయ్ చెప్పారు. విజయ్ ప్రయత్నాన్ని అభినందించిన మంత్రులు... భవిష్యత్తు ప్రయత్నాలకు సంపూర్ణ సహకారం అందిస్తామని తెలిపారు. త్వరలో తన యూనిట్ ప్రారంభోత్సవానికి రావాలని మంత్రి కేటీఆర్​ను విజయ్ ఆహ్వానించారు. ప్రారంభోత్సవానికి రావడంతో పాటు విజయ్​కు అన్ని రకాలుగా సహకరిస్తానని కేటీఆర్ హామీ ఇచ్చారు.

Saree in Matchbox
మంత్రి సబితకు అగ్గిపెట్టెలో పట్టే చీరను బహుకరిస్తున్న నేతన్న విజయ్

ఇదీ చదవండి: Bandi Sanjay on CM KCR: కేసీఆర్​ ఎప్పుడైనా జైలుకు వెళ్లొచ్చు.. బండి సంజయ్​ సంచలన వ్యాఖ్యలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.