రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు వైద్య కళాశాలల్లో కన్వీనర్ కోటాలో 105 ఎంబీబీఎస్ సీట్లు మిగిలాయి. ఆ సీట్ల ఆఖరి విడత కౌన్సెలింగ్కు కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం చర్యలు చేపట్టింది. ఇప్పటికే మూడు విడతల ప్రవేశ ప్రక్రియ పూర్తవగా.. మిగిలిన సీట్లకు ఆదివారం సాయంత్రం నుంచే వెబ్ఆప్షన్లకు విద్యార్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానించింది. ఇందుకు సంబంధించిన సంక్షిప్త సందేశాలను అర్హులైన విద్యార్థుల ఫోన్లకు పంపించింది. కళాశాలల వారీగా ఖాళీలను వెబ్సైట్లో అధికారులు పొందుపర్చారు.
మొదటి ర్యాంకు నుంచి చివరి ర్యాంకు వరకు అర్హులైన అభ్యర్థులందరూ సిద్ధంగా ఉండలన్నారు. ఈ నెల 26న సాయంత్రం 5 గంటల్లోపు వెబ్ఆప్షన్లు నమోదు చేసుకోవాలని కాళోజీ ఆరోగ్య వర్సిటీ ఉపకులపతి కరుణాకర్ రెడ్డి తెలిపారు. అభ్యర్థులకు ఈ నెల 29వరకు గడువు ఇవ్వనున్నట్లు వర్సిటీ వర్గాలు తెలిపాయి. యాజమాన్య, ప్రవాస భారతీయ కోటాల్లో ప్రవేశాలకూ ఈ నెల 27తో గడువు ముగియనుంది. ఆయా కోటాల్లో ఆఖరి విడతను 28న నిర్వహించాలని వర్సిటీ యోచిస్తోంది. అప్పటికీ యాజమాన్య, ప్రవాస భారతీయ కోటాల్లో సీట్లు మిగిలితే వాటిని ఆయా కళాశాలలకే భర్తీ చేసుకోవడానికి అవకాశమిస్తామన్నారు. అన్ని కోటాల్లోనూ ఎంబీబీఎస్ సీట్ల ప్రవేశాలను ఈ నెల 31వ తేదీతో పూర్తి చేయాలనే ఎంసీఐ సూచనతో... కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం ఏర్పాట్లు చేస్తోంది.
ఇదీ చూడండి : అభిరుచులకు అనుగుణంగా రెస్టారెంట్