ETV Bharat / state

శాసనమండలికి నూతన భవనం - రాష్ట్ర సర్కార్ ప్రతిపాదన

Telangana Legislative Council New Building 2023 : తెలంగాణ శాసనమండలి నూతన భవనం నిర్మాణంపై కాంగ్రెస్ సర్కార్ ప్రణాళికలు రచిస్తోంది. హైదరాబాద్‌ పబ్లిక్‌ గార్డెన్స్‌లో ఉన్న జూబ్లీ హాల్‌ ప్రాంగణంలో ప్రస్తుతం శాసనమండలి కొనసాగుతున్న విషయం తెలిసిందే. అదే ప్రాంగణంలో నూతన భవనాన్ని నిర్మించాలనే ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. అయితే మండలి భవన నిర్మాణానికి చారిత్రక చిక్కులు వచ్చినట్లు తెలుస్తోంది.

Telangana Legislative Council New Building 2023
Telangana
author img

By ETV Bharat Telangana Team

Published : Dec 13, 2023, 10:00 AM IST

Telangana Legislative Council New Building 2023 : రాష్ట్ర, దేశ రాజధాని నగరాల్లో తెలంగాణ ముద్ర చాటేలా శాసనమండలి, తెలంగాణ భవన్‌ల నిర్మాణానికి కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్‌ సర్కార్ రూపకల్పన చేస్తోంది. హైదరాబాద్‌ పబ్లిక్‌ గార్డెన్స్‌లో ఉన్న జూబ్లీ హాల్‌ ప్రాంగణంలో ప్రస్తుతం శాసనమండలి కొనసాగుతున్న విషయం తెలిసిందే. అదే ప్రాంగణంలో నూతన భవనాన్ని నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వ ఆలోచన చేస్తోంది.

మరోవైపు 1956 నుంచి దిల్లీలోని ఏపీ భవన్‌ ఉమ్మడిగా సాగుతోంది. 2014లో తెలంగాణ రాష్ట్రం విడిపోయినప్పటికీ ఆస్తులు, అప్పుల పంపకం వ్యవహారం ఇంకా కొలిక్కి రాలేదు. ఈ పరిస్థితులలో రెండు భవనాల నిర్మాణానికి ఎదురయ్యే అడ్డంకులు, తదితరాలపై అధ్యయనం చేయాలని సర్కార్ భావిస్తోంది. రాష్ట్ర రహదారులు, భవనాలశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మంగళవారం దిల్లీలోని ఏపీ భవన్‌లో ఖాళీ స్థలాన్ని పరిశీలించారు.

విభజన కొలిక్కి వస్తేనే దిల్లీలో ఇండియా గేట్‌కు సమీపంలోని అశోక రోడ్డులో రెండు భాగాలుగా 19 ఎకరాల విస్తీర్ణం ఏపీ భవన్‌ పరిధిలో ఉంది. అయితే అందులో 12 ఎకరాలు రోడ్డుకు ఒక వైపు, మరో ఏడు ఎకరాల రోడ్డుకు ఇంకో వైపు ఉన్నాయి. పోతే 12 ఎకరాల్లోనే ప్రస్తుతం భవనాలు నిర్మించి ఉన్నాయి. రెండో వైపు ఏడు ఎకరాల స్థలం ఖాళీగానే ఉంది. విభజన సమస్యలు కొలిక్కి రాకపోవడంతో ఆ భవనంలోనే వేరువేరుగా బోర్డులు ఏర్పాటు చేసుకుని రెండు ప్రభుత్వాలు తమ కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయి. ఖాళీగా ఉన్న ఏడు ఎకరాల స్థలంలో తెలంగాణ భవన్‌ నిర్మించటం ద్వారా దేశ రాజధానిలో తెలంగాణ వైభవాన్ని చాటాలనేది కాంగ్రెస్‌ సర్కార్ తాజా వ్యూహం. ఈ అంశంపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శుల స్థాయిలో చర్చలు నిర్వహించి వ్యవహారాన్ని కొలిక్కి తేవాలని రాష్ట్ర ప్రభుత్వం అధికారులకు ప్రతిపాదించినట్టు తెలిసింది.

ప్రజావాణికి పొటెత్తిన జనం- డబుల్ బెడ్‌రూం, భూ సమస్యలే అధికం

మండలికి చారిత్రక చిక్కులు : రాష్ట్ర శాసనసభ, శాసన మండలిలకు నూతన భవనాలు నిర్మించాలని గతంలో బీఆర్ఎస్​ ప్రభుత్వం నిర్ణయించింది. ఎర్రమంజిల్‌లో నీటిపారుదల, రహదారుల భవన ప్రాంగణంలో నిర్మించేందుకు గత రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ శంకుస్థాపన కూడా చేశారు. వాస్తవంగా అయితే ఆ భవనం చారిత్రక భవనాల జాబితాలో ఉంది. ఆ చిక్కుముడులను విప్పేందుకు అప్పట్లో బీఆర్ఎస్ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. తాజాగా జూబ్లీ హాల్‌ ప్రాంగణంలోనే శాసనమండలికి నూతన భవనాన్ని నిర్మించాలని రాష్ట్ర సర్కార్ ప్రతిపాదించడం చర్చనీయాంశం అయింది.

Construction of New Buildings for Telangana Legislative Assembly : ఏడో నిజాం మీర్‌ ఉస్మాన్‌ అలీ ఖాన్‌ హయాంలో 1937 ప్రాంతంలో జూబ్లీ హాల్‌ భవనం రూపుదాల్చింది. ఆ తర్వాత అది ప్రభుత్వం పరిధిలోకి వచ్చింది. అయితే 2006 నుంచి ఆ భవనంలోనే శాసనమండలి సమావేశాలు నిర్వహిస్తున్నారు. అదే ప్రాంగణంలో నూతన భవనం నిర్మించాలంటే భవనాన్ని కూల్చివేయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన అనుమతులు తెచ్చేందుకు, అడ్డంకులు అధిగమించేందుకు కనీసం ఏడాదిన్నర సమయం పడుతుందని అంచనా వేస్తున్నారు. అప్పటివరకు సమావేశాలు ఎక్కడ నిర్వహిస్తారనేది ప్రశ్నగా మిగిలింది. ఆయా సమస్యలు కొలిక్కి తేవాలని ప్రభుత్వం ప్రతిపాదించిన నేపథ్యంలో అధికారులు సంబంధిత కసరత్తును ఆరంభించారు.

మూడో గ్యారంటీపై సర్కార్ ఫోకస్ - రూ.2 లక్షల రుణమాఫీపై కసరత్తు షురూ

టీఎస్​పీఎస్సీ ప్రక్షాళనకు సీఎం ఆదేశం - యూపీఎస్సీ, ఇతర రాష్ట్రాల కమిషన్ల అధ్యయనానికి ఆదేశం

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.