భూ అక్రమాలను వెలుగులోకి తెచ్చిన పాత్రికేయుడు రఘుకు ప్రాణహాని ఉందని.. అతనికి రక్షణ కల్పించాలని తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం రాష్ట్ర మానవ హక్కుల కమిషన్కు ఫిర్యాదు చేసింది. కొంతమంది గుర్తుతెలియని వ్యక్తులు కారులో బలవంతంగా తీసుకెళ్లారని ఫోరం ప్రతినిధులు కమిషన్ దృష్టికి తీసుకెళ్లారు.
మరోవైపు రఘుపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేసి అతడిని వెంటనే విడుదల చేయాలని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం అన్నారు. పాత్రికేయుడిగా నిజాలను వెలుగులోకి తెచ్చేందుకు ప్రయత్నించిన వ్యక్తిని అక్రమంగా అరెస్టు చేయడంతో పాటు రోజుకో కేసు పెడుతున్నారని ఆయన మండిపడ్డారు.
ఇదీ చూడండి: DSC: కనీస వేతనంతో కాంట్రాక్ట్ టీచర్లుగా డీఎస్సీ అభ్యర్థులు