హైదారాబద్‌లో 2014-15లో ఐటీ ఎగుమతులు రూ.50వేల కోట్ల లోపే ఉన్నాయన్నారు ఐటీ శాఖ మంత్రి కేటీఆర్. ఈ ఏడాది ఐటీ ఎగుమతులు రూ.లక్ష కోట్లు దాటాయని వెల్లడించారు. అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందిన కంపెనీలు హైదరాబాద్‌కు వస్తున్నాయని అసెంబ్లీలో తెలిపారు. ఖమ్మం, కరీంనగర్‌లో ఏర్పాటు చేస్తున్న ఐటీ హబ్‌లు కూడా త్వరలో ప్రారంభం కానున్నాయని ప్రకటించారు. జిల్లా కేంద్రాల్లోనూ టాస్క్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. పనితీరు బాగుంది కాబట్టే.... హైదరాబాద్ ప్రజలు తెరాసకు స్పష్టమైన మెజార్టీ ఇచ్చారన్నారు. మన నగర అభివృద్ధిని మనమే తక్కువ చేసి చూపొద్దని సూచించారు. ఐదేళ్లలో మైనింగ్ రంగంలో రూ.16,930 కోట్లు ఆర్జించామని వెల్లడించారు.
ఇవీ చూడండి.. మా మొదటి ప్రాధాన్యం పంత్ : ఎమ్మెస్కే ప్రసాద్