Telangana Irrigation projects : దేశీయ, విదేశీయ పర్యాటకులను ఆకర్షించేలా రాష్ట్ర ప్రభుత్వం వివిధ కార్యాచరణ కార్యక్రమాలను చేపడుతోంది. రాష్ట్రంలో ఉన్న సాగునీటి ప్రాజెక్టుల వద్ద కూడా పర్యాటకాన్ని అభివృద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ప్రాజెక్టులు, నదీ తీరాలు, జలాశయాలు, కాలువలు, తదితర ప్రాంతాల వద్ద అవసరమైన వసతులు కల్పించడం ద్వారా పర్యాటకులను ఆకర్షించవచ్చన్నది ప్రభుత్వ ఆలోచిస్తోంది.
Telangana Irrigation projects as tourist places : ప్రాజెక్టులు, నదీతీరాలు, జలాశయాలు, కాల్వలు వద్ద అవసరమైన వసతులు కల్పించడం ద్వారా పర్యాటకులను ఆకర్షించవచ్చన్నది ప్రభుత్వ భావన. నదీతీరాలు, ప్రాజెక్టుల వద్ద ఉన్న ఖాళీ స్థలం, గెస్ట్‌హౌజ్‌లు వంటి వాటిని వినియోగించుకోవడం ద్వారా పర్యాటకాన్ని అభివృద్ధి చేయవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకోసం 2023-24 బడ్జెట్‌లో నిధులను కేటాయించారు. ఈ రకంగా పర్యటకాన్ని వృద్ధి చేస్తే రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతుందని అధికారులు ఆకాంక్షిస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రం పర్యాటకంగా అభివృద్ది చెందుతోంది.
తొలి దశలో 8 ప్రాజెక్టులు అభివృద్ధి: దశలవారీగా రాష్ట్రంలోని వివిధ సాగునీటి ప్రాజెక్టుల వద్ద అందుకుఅనుగుణంగా వసతులు కల్పించాలని సర్కార్ సంకల్పించింది. ఆ దిశగా ఇప్పటికే నీటిపారుదల, పర్యాటకశాఖలు పలు దఫాలు కసరత్తు చేశాయి. తొలి విడతలో 8 ప్రాజెక్టుల వద్ద పర్యాటకాన్ని అభివృద్ధి చేయాలని సూత్ర ప్రాయంగా నిర్ణయించారు. పెన్‌గంగా, పోచారం రంగనాయక సాగర్, కోయిల్‌సాగర్, శ్రీరామ్‌సాగర్ ప్రాజెక్ట్, డిండి రిజర్వాయర్, బాపనికుంట వద్ద పర్యాటకులకు అవసరమైన వసతులు కల్పించేలా చర్యలు చేపట్టనున్నారు. పర్యటకలను ఆకర్షించే విధంగానే కాకుండా ఆనందంగా గడిపేలా సౌకర్యాలను ఏర్పాటు చేయనున్నది.
అన్ని వినోదాత్మక సౌకర్యాలు ఏర్పాటు: అక్కడ ఉన్న గెస్ట్ హౌస్‌లను పర్యాటకలకు అనుగుణంగా అభివృద్ధిచేయడం సహా హోటళ్లు, రిసార్టులు, వినోదక్లబ్బులు, ఫుడ్‌కోర్టులను ఏర్పాటు చేయనున్నారు. పర్యాటకులకోసం కాటేజీల నిర్మాణం, ల్యాండ్ స్కేపింగ్, రహదారుల అభివృద్ధి, సస్పెన్షన్ బ్రిడ్జిల నిర్మాణం చేపడతారు. వినోద, సాహస క్రీడలు అందుబాటులోకి తీసుకురానున్నారు. వాటర్ స్పోర్ట్స్, బోటింగ్, క్రూయిజింగ్ ప్యారాగ్లైడింగ్, ట్రెక్కింగ్ వంటివాటిని ఏర్పాటు చేయనున్నారు. మొదటి దేశ ప్రాజెక్టులకు సంబంధించి నీటిపారుదల, పర్యాటకుల శాఖల మధ్య ఇప్పటికే దాదాపుగా అవగాహన కుదిరింది. ఆయా ప్రాజెక్ట్‌ల వద్ద చేయాల్సిన పనులను త్వరలోనే ప్రారంభించేందుకు రంగం సిద్దం చేస్తున్నారు.
ఇవీ చదవండి: