తెలంగాణ రాష్ట్ర ఇన్నోవేషన్ సెల్(టీఎస్ఐసీ) నిర్వహించిన తెలంగాణ సోషల్ ఇంపాక్ట్ బూట్ క్యాంప్ నేటితో ముగిసింది. ఐటీ శాఖ, ఇక్రిశాట్, బాల వికాస ఇంటర్నేషనల్ సెంటర్ భాగస్వామ్యంతో జరిగిన ఈ క్యాంప్‌లో 9 ప్రభుత్వ విభాగాలు, 20కి పైగా పెట్టుబడిదారులు, 61 సామాజిక అంకురాలు పాల్గొన్నాయి. ఆరోగ్యం, విద్య, వ్యవసాయం, నైపుణ్యాభివృద్ధి, పర్యావరణం, దివ్యాంగుల సంక్షేమం తదితర అంశాలకు సంబంధించిన అంకురాలు పాల్గొన్నాయి.
వర్చువల్‌గా జరిగిన ఈ సమావేశంలో మెంటార్షిప్, వర్క్ షాపులు, ప్రభుత్వం-పెట్టుబడిదారుల అనుసంధానం లాంటి కార్యక్రమాలు చేపట్టారు. అంకురాల ఆలోచనలను ప్రయోగాత్మకంగా పరిశీలించేందుకు ప్రభుత్వ విభాగాల అధికారులతో అంకురాల ప్రతినిధులు చర్చించారు. కరోనా లాంటి కఠిన సమయాల్లో తెలంగాణ ప్రభుత్వం అంకురాలకు కావాల్సిన తోడ్పాటునందించిందని ఐటీ శాఖ ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ అన్నారు.
ఇదీ చదవండి: తెలంగాణలో వైఎస్ లోటు కనిపిస్తోంది: షర్మిల