ETV Bharat / state

Fine for Not Wearing Mask : జర భద్రం.. అడుగు బయటపెట్టాలంటే అవి ఉండాల్సిందే! - తెలంగాణ వార్తలు

Without mask fine: శానిటైజేషన్​, మాస్కుల నిబంధనలు మళ్లీ షురూ అయ్యాయి. కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ నేపథ్యంలో మాస్కులు ధరించకుండా బయటకు వచ్చిన వారిపై పోలీసులు కొరడా ఝుళిపిస్తున్నారు. ఇప్పటివరకు హెచ్చరికలు, సూచనలతో సరిపెట్టిన పోలీసులు.. ఇప్పుడు కేసులు నమోదు చేసి రూ.1000 జరిమానా విధిస్తున్నారు.

Without mask fine
Without mask fine
author img

By

Published : Dec 5, 2021, 10:13 AM IST

Without mask fine in telangana: కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ నేపథ్యంలో పోలీసులు ముందు జాగ్రత్తలపై దృష్టి సారించారు. ప్రతి ఒక్కరు విధిగా మాస్కు ధరించాలనే నిబంధనను కఠినంగా అమలు చేస్తున్నారు. మాస్కులు ధరించకుండా తిరిగే వారిపై కేసులు నమోదు చేసి.. న్యాయస్థానాల్లో చార్జ్‌షీట్‌లు దాఖలు చేస్తున్నారు. రూ.1000 జరిమానా విధిస్తున్నారు. గత ఏడాది 2020లో రాష్ట్ర వ్యాప్తంగా మాస్కులు ధరించని వారిపై 3,26,758 కేసులు నమోదయ్యాయి, ఇక ఈ ఏడాది మాస్కులు ధరించని వారి మీద 9,89,340 వారిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. లాక్‌డౌన్‌ తర్వాత కొందరు మాస్కులు ధరించకుండా తిరుగుతండటంతో.. పోలీసులు కేసులు నమోదు చేసి జరిమానా విధిస్తున్నారు. ఒమిక్రాన్‌ వేరియంట్‌ ప్రబలుతుండడం వల్ల అధికారులు కూడా మాస్కులు ధరించాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

బస్సు ఎక్కాలంటే మాస్కు ఉండాల్సిందే...

Penalty for not Wearing Masks : 'సరైన మాస్క్‌ ఉంటేనే ప్రయాణికులను బస్సుల్లోకి అనుమతించాలి. డ్రైవర్‌, కండక్టర్‌ విధిగా మాస్క్‌ ధరించాలి. శానిటైజర్‌ సీసాను అందుబాటులో ఉంచుకోవాలని' ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ ఉత్తర్వులు జారీ చేశారు. కరోనా ప్రబలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను బస్‌స్టాండ్లలో మైకుల ద్వారా తరచూ ప్రకటిస్తుండాలని ఆయన సూచించారు. ‘డిపో నుంచి బస్సులు బయటకు వచ్చే ప్రతిసారీ పూర్తిస్థాయిలో శుభ్రం చేయాలి. బస్‌స్టాండు ఆవరణలో ప్రయాణికులు మాస్కులు ధరించడం అనివార్యమని స్పష్టంచేసే బ్యానర్లు ఏర్పాటుచేయాలి. బస్‌స్టాండ్లను తరచూ శుభ్రం చేస్తుండాలి. అన్ని రెస్ట్‌ రూముల్లో సబ్బులు అందుబాటులో ఉంచాల’ని సజ్జనార్‌ ఆదేశించారు.

ఇదీ చదవండి: Omicron variant: 'కేసులు నిలకడగానే ఉన్నాయి.. ఆందోళన పడాల్సిన అవసరం లేదు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.