ETV Bharat / state

అమ్మ ఆశీర్వాదమే విజయానికి సంకేతం: హోంమంత్రి

ముఖ్యమంత్రి కేసీఆర్​ మహిళల సంక్షేమం, అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నారని రాష్ట్ర హోం మంత్రి మహమూద్​ అలీ అన్నారు. హైదరాబాద్​లో తెలంగాణ సారస్వత పరిషత్​లో ప్రతిఘటన మహిళా శక్తి ఫౌండేషన్​ ఆధ్వర్యంలో నిర్వహించిన మహిళా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు.

telangana home minister mahmood ali attended a program on the eve of international women's day
'అమ్మ ఆశీర్వాదం తోసుకోనిదే... బయటకెళ్లను'
author img

By

Published : Mar 9, 2020, 9:24 AM IST

'అమ్మ ఆశీర్వాదం తోసుకోనిదే... బయటకెళ్లను'

దేశంలో ఎక్కడా లేనివిధంగా మహిళల పేరుతో అనేక సంక్షేమ పథకాలు చేపట్టిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్​కే దక్కుతుందని రాష్ట్ర హోంమంత్రి మహమూద్​ అలీ అన్నారు. స్త్రీల రక్షణ కోసం షీ టీమ్స్, భరోసా కేంద్రాలతోపాటు పోలీసు శాఖలో మహిళలకు 32 శాతం, మున్సిపల్​ ఎన్నికల్లో 55 శాతం పదవులు కేటాయించారని తెలిపారు.

హైదరాబాద్​ అబిడ్స్​లోని తెలంగాణ సారస్వత పరిషత్​లో ప్రతిఘటన మహిళా శక్తి ఫౌండేషన్​ ఆధ్వర్యంలో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో మంత్రి మహమూద్​ అలీ పాల్గొన్నారు. పలు స్వచ్ఛంద సంస్థల ద్వారా మహిళలకు సేవాకార్యక్రమాలు చేస్తున్న వారిని హోంమంత్రి సన్మానించారు.

మాతృమూర్తిని గౌరవించడమే గాక, ఎక్కడికి వెళ్లినా వారి ఆశీర్వాదం తీసుకోవాలని... తాను నిత్యం ఇదే బాటలో నడుస్తున్నానని హోంమంత్రి తెలిపారు. అమ్మ ఆశీర్వాదం ఉంటే ఏదైనా చేయగల సత్తా వస్తుందన్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.