ETV Bharat / state

'ఆ పది ప్రైవేట్​ పాఠశాలలు ప్రభుత్వ ఉత్తర్వులను ఉల్లంఘించాయి' - సెయింట్ ఆండ్రూస్ పాఠశాల వార్తలు

ప్రైవేట్ పాఠశాలల్లో ఆన్​లైన్ తరగతులు, అధిక ఫీజులపై హైదరాబాద్ స్కూల్ పేరెంట్స్ అసోసియేషన్ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్, జస్టిస్ బి.విజయ్ సేన్ రెడ్డి ధర్మాసనం గురువారం మరోసారి విచారణ చేపట్టింది. హైదరాబాద్​లోని పది ప్రైవేట్ పాఠశాలలు ప్రభుత్వ ఉత్తర్వులను ఉల్లంఘించాయని పాఠశాల విద్యా శాఖ హైకోర్టుకు నివేదించింది.

telangana hihg court hearing on private schools fees in hyderabad
'ఆ పది ప్రైవేట్​ పాఠశాలలు ప్రభుత్వ ఉత్తర్వులను ఉల్లంఘించాయి'
author img

By

Published : Nov 5, 2020, 6:10 PM IST

కరోనా పరిస్థితుల్లో ఫీజులకు సంబంధించిన ప్రభుత్వ ఉత్తర్వులను హైదరాబాద్​లోని పది ప్రైవేట్ పాఠశాలలు ఉల్లంఘించాయని పాఠశాల విద్యా శాఖ హైకోర్టుకు నివేదించింది. రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులను ఉల్లంఘించిన పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ బోర్డులకు నివేదిక ఇస్తామని పేర్కొంది. ప్రైవేట్ పాఠశాలల్లో ఆన్​లైన్ తరగతులు, అధిక ఫీజులపై హైదరాబాద్ స్కూల్ పేరెంట్స్ అసోసియేషన్ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్, జస్టిస్ బి.విజయ్ సేన్ రెడ్డి ధర్మాసనం ఇవాళ మరోసారి విచారణ చేపట్టింది.

హైదరాబాద్​లోని 11 కార్పొరేట్ పాఠశాలలపై అందిన ఫిర్యాదులపై చేసిన విచారణ నివేదికను పాఠశాల విద్యా శాఖ సంచాలకురాలు శ్రీదేవసేన హైకోర్టుకు నివేదిక సమర్పించారు. మణికొండలోని మౌంట్ లిటెరా జీ, బంజారాహిల్స్ మెరిడియన్, హిమాయత్​నగర్ ఆక్స్ ఫర్డ్ గ్రామర్, అమీర్​పేట నీరజ్ పబ్లిక్ స్కూల్, జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్, గీతాంజలి, ఆబిడ్స్ లిటిల్ ఫ్లవర్, కల్ప, బోయిన్ పల్లి, మారేడ్​పల్లిలోని సెయింట్ ఆండ్రూస్ పాఠశాలలు జీవోకు విరుద్ధంగా ఫీజులు వసూలు చేసినట్లు విచారణలో తేలినట్లు శ్రీదేవసేన వివరించారు.

డీడీ కాలనీలోని నారాయణ హైస్కూల్​పై విచారణ కొనసాగుతోందని తెలిపారు. జీవో 46 అమలుకు కట్టుబడి ఉన్నట్లు పాఠశాల విద్యా శాఖ తెలిపింది. వాదనలు వినిపించేందుకు సీబీఎస్ఈ తరఫు న్యాయవాది గడువు కోరటంతో న్యాయస్థానం విచారణను ఈనెల 25కి వాయిదా వేసింది.

ఇదీ చదవండి: భార్య గొంతు కోసి కాలువలో పడేసి...

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.