ETV Bharat / state

Telangana High Court : తెలంగాణ హైకోర్టుకు ముగ్గురు కొత్త న్యాయమూర్తులు

author img

By

Published : Jul 15, 2023, 9:13 AM IST

Telangana High Court New Judges : తెలంగాణ రాష్ట్ర హైకోర్టుకు ముగ్గులు న్యాయమూర్తులను నియనించాలని సుప్రీంకోర్టు కొలీజియం కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. ఈ ముగ్గురు న్యాయమూర్తుల్లో అడ్వొకేట్​ కోటా నుంచి లక్ష్మీనారాయణ అలిశెట్టి, అనిల్​ కుమార్ జూకంటి, న్యాయాధికారుల కోటా నుంచి సుజన కలసికం ఉన్నారు.

high court
high court

Telangana High Court New Judges : సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ నేతృత్వంలో ఈ నెల 12న సమావేశమైన జస్టిస్‌ సంజయ్‌కిషన్‌కౌల్‌, జస్టిస్‌ సంజీవ్‌ఖన్నాలతో కూడిన కొలీజియం.. తెలంగాణ హైకోర్టుకు ముగ్గురు న్యాయమూర్తులను నియమించాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు శుక్రవారం కొలీజియం ఒక ప్రకటన విడుదల చేసింది.

తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అక్కడి ఇద్దరు సీనియర్‌ న్యాయమూర్తులతో సంప్రదించిన అనంతరం న్యాయవాదుల కోటా నుంచి ఎంపిక చేసిన ఇద్దరి పేర్లను 2022 డిసెంబరు 22న ప్రతిపాదించారని పేర్కొంది. న్యాయాధికారి కోటాలో ఎంపిక చేసిన పేరును అదే ఏడాది అక్టోబరు 23న సిఫార్సు చేయగా... ఈ పేర్లకు రాష్ట్ర గవర్నర్‌, ముఖ్యమంత్రి కూడా ఆమోదముద్ర వేశారని కొలీజియం వెల్లడించింది. న్యాయవాద వృత్తిలో లక్ష్మీనారాయణకు 26 ఏళ్లు, అనిల్‌కుమార్‌కు 20 ఏళ్ల అనుభవం ఉందన్న కొలీజియం... లక్ష్మీనారాయణకు ఆర్బిట్రేషన్‌లో, రిట్‌, సివిల్‌, కమర్షియల్‌ లిటిగేషన్‌ కేసుల్లో నైపుణ్యం ఉందని తెలిపింది. అనిల్‌కుమార్‌కు ట్యాక్సేషన్‌లో ప్రావీణ్యం ఉండగా ఆయన సివిల్‌, క్రిమినల్‌, సర్వీస్‌ లా, కాన్‌స్టిట్యూషనల్‌ కేసులు వాదించారని కొలీజియం ప్రకటనలో వెల్లడించింది.

Telangana High Court Latest News : "న్యాయాధికారి సుజన పేరును పరిశీలించేటప్పుడు కొందరు సీనియర్‌ న్యాయాధికారుల పేర్లను హైకోర్టు సిఫార్సు చేయలేదన్న విషయాన్నీ పరిగణనలోకి తీసుకున్నాం. ఆమెకంటే సీనియర్ల పేర్లను ఎందుకు సిఫార్సు చేయలేదో చెబుతూ హైకోర్టు కొలీజియం చెప్పిన కారణాలను పరిశీలించి, వాటితో ఏకీభవించాం. సుప్రీంకోర్టులో తెలంగాణ అంశాలపై అవగాహన ఉన్న సహచర న్యాయమూర్తులు, కేంద్ర న్యాయశాఖ అభిప్రాయాలను క్రోడీకరించాక న్యాయవాదులు లక్ష్మీనారాయణ అలిశెట్టి, అనిల్‌కుమార్‌ జూకంటి, న్యాయాధికారి సుజన కలసికం హైకోర్టు న్యాయమూర్తులుగా నియమించడానికి తగినవారన్న నిర్ణయానికి వచ్చి, వారి పేర్లను సిఫార్సు చేయాలని నిర్ణయించాం’’ అని కొలీజియం వివరించింది. మొత్తంగా 49 మంది న్యాయమూర్తులు ఉండాల్సిన తెలంగాణ హైకోర్టులో ప్రస్తుతం 25 మంది పని చేస్తున్నారు. వారిలో మహిళా న్యాయమూర్తుల సంఖ్య ఎనిమిది. కొత్త వారి నియామకానికి కేంద్రం ఆమోదిస్తే మొత్తం న్యాయమూర్తుల సంఖ్య 28కి, మహిళా న్యాయమూర్తుల సంఖ్య 9కి చేరుతుంది.

సుజన కలసికం : యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరుకు చెందిన మధుసూదన్​, ప్రమీల దంపతులకు 1970 మార్చి 10వ తేదీనా సుజన కలసికం జన్మించారు. 1997లో బార్​ కౌన్సిల్​లో నమోదయ్యారు. 2010 సంవత్సరంలో జూనియర్ సివిల్ జడ్డిగా ఎంపికయ్యారు. ఈ హోదాలోనే కొనసాగుతూనే 2012లో జిల్లా జడ్జి పరీక్షలు రాశారు. కరీంనగర్‌ అదనపు జిల్లా జడ్జిగా, నిజామాబాద్‌ జిల్లా జడ్జిగా, హైదరాబాద్‌ సిటీ సివిల్‌ కోర్టులో స్మాల్‌ కాజెస్‌ కోర్టు చీఫ్‌ జడ్జిగా, జ్యుడిషియల్‌ అకాడమీ డైరెక్టర్‌గా పనిచేశారు. సంవత్సరం నుంచి హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్​గా విధులు నిర్వహిస్తున్నారు.

లక్ష్మీనారాయణ అలిశెట్టి : నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండలం మెండోరాలో ఓ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు గంగాధర్, రాజుబాయి దంపతులకు 1968 మే 13న అలిశెట్టి జన్మించారు. సొంత జిల్లాలోనే డిగ్రీ పూర్తి చేసి, కాకతీయ విశ్వవిద్యాలయం నుంచి న్యాయశాస్త్రంలో పట్టా పొందారు. 1994లో బార్​కౌన్సిల్ మెంబర్​ అయ్యారు. రాజ్యాంగం, సివిల్‌ లాలో పట్టు సాధించారు. జాతీయ రహదారుల అభివృద్ధి అథారిటీ, ఎన్‌బీసీసీ, వివిధ బ్యాంకులకు స్టాండింగ్‌ కౌన్సిల్‌గా పని చేశారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.