ఆదాయానికి మించి ఆస్తుల కేసులో ఈడీ మాజీ అధికారి బీఎస్ గాంధీ భార్య శిరీషను నిబంధనల ప్రకారమే విచారణ జరపాలని సీబీఐ(CBI)కి హైకోర్టు(ts high court) స్పష్టం చేసింది. బీఎస్ గాంధీపై ఆదాయానికి మించిన కేసులో తనను నిందితురాలిగా చేర్చారని.. తనపై కేసును కొట్టివేయాలని కోరుతూ శిరీష దాఖలు చేసిన క్వాష్ పిటిషన్పై శుక్రవారం విచారణ జరిగింది.
సీబీఐ(CBI) 2019లో నమోదు చేసిన కేసును తనను, కుమార్తెను, బంధువులను కూడా దర్యాప్తు అధికారులు వేధిస్తున్నారని.. అరెస్టు చేస్తామని బెదిరిస్తున్నారని పిటిషనర్ పేర్కొన్నారు. ఎవరినీ వేధించడం లేదని.. బీఎస్ గాంధీ సాక్షులను ప్రభావితం చేసేందుకు ప్రయత్నించినందుకే అరెస్టు చేసినట్లు సీబీఐ వివరించింది.
ఇరువైపుల వాదనలు విన్న హైకోర్టు(ts high court) శిరీషను సీఆర్ పీసీ 41ఏ నిబంధన ప్రకారమే విచారణ జరపాలని సీబీఐని ఆదేశించింది. నోటీసులు ఇవ్వాలని.. మహిళ న్యాయవాదిని అనుమతించాలని తెలిపింది. మహిళ న్యాయవాది విచారణలో జోక్యం చేసుకోరాదని.. శిరీష విచారణకు సహకరించాలని ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.
ఇదీ చూడండి: వైద్యుడి నిర్లక్ష్యం వల్లే... మా తల్లి మరణించింది