దళిత బంధు పథకంపై దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై అత్యవసర విచారణ చేపట్టేందుకు హైకోర్టు నిరాకరించింది. ఈ పిల్ విచారణ జాబితాలోకి వచ్చినప్పుడే పరిశీలిస్తామని స్పష్టం చేసింది.
హుజూరాబాద్ నియోజకవర్గంలో 'దళిత బంధు' పథకాన్ని పైలట్ ప్రాజెక్టుగా చేపట్టడాన్ని సవాల్ చేస్తూ జనవాహిని, జై స్వరాజ్, తెలంగాణ రిపబ్లికన్ పార్టీలు సహా మరో వ్యక్తి ప్రజాప్రయోజన వ్యాజ్యాలు దాఖలు చేశారు. వీటిపై ఇవాళే అత్యవసరంగా విచారణ జరపాలని న్యాయవాది రాజు కోరారు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమా కోహ్లి, జస్టిస్ బి.విజయసేన్‌రెడ్డి ధర్మాసనం నిరాకరించింది.
ఇవీచూడండి: