ETV Bharat / state

జూన్​లో 'పది' పరీక్షలకు హైకోర్టు అంగీకారం

జూన్ మొదటి వారం తర్వాత పదో తరగతి పరీక్షలు నిర్వహించుకోవచ్చునని హైకోర్టు తెలిపింది. ఒక్కో పరీక్షకు మధ్య రెండు రోజుల వ్యవధి ఉండాలని ఆదేశించింది. ఐతే జూన్ 3న రాష్ట్రంలో కరోనా పరిస్థితిని సమీక్షించి తుది నిర్ణయం తీసుకోవాలని స్పష్టం చేసింది. జూన్ 3 నాటికి కూడా కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్నట్లయితే పరీక్షలకు ముందుకెళ్లొద్దని స్పష్టం చేసింది. విద్యార్థులు, తల్లిదండ్రులు ఫిర్యాదులు చేసేందుకు ప్రత్యేక సహాయకేంద్రం ఏర్పాటు చేయాలని ఆదేశించింది.

telangana-high-court-on-ssc-exams
జూన్​లో 'పది' పరీక్షలకు హైకోర్టు అంగీకారం
author img

By

Published : May 19, 2020, 4:03 PM IST

Updated : May 19, 2020, 4:09 PM IST

వాయిదా పడిన పదో తరగతి పరీక్షలను జూన్ 8 నుంచి లేదా ఆ తర్వాత నిర్వహించుకోవాలని ప్రభుత్వానికి హైకోర్టు సూచించింది. ఈనెల 31 వరకు లాక్ డౌన్ ఉండగా పరీక్షలు నిర్వహించవద్దని స్పష్టం చేసింది. మార్చి 19 నుంచి 21 వరకు రెండు సబ్జెక్టులకు సంబంధించిన మూడు పరీక్షలు పూర్తయ్యాయి. అయితే కరోనా తీవ్రత దృష్ట్యా పరీక్షలు వాయిదా వేయాలని కోరుతూ ప్రైవేట్ ఉపాధ్యాయుడు బాలకృష్ణ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు.. పరీక్షలను వాయిదా వేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. దాంతో మార్చి 23 నుంచి ఏప్రిల్ 6 వరకు జరగాల్సిన నాలుగు సబ్జెక్టులకు సంబంధించిన ఎనిమిది పరీక్షలు వాయిదా పడ్డాయి. అయితే విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని.. మే నెలలోనే పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం భావించింది. పరీక్షల నిర్వహణకు అనుమతి ఇవ్వాలని విద్యా శాఖ హైకోర్టును కోరింది.

లాక్​డౌన్​ వేళ వద్దు..

వైద్యుల సూచనల మేరకు కరోనా నివారణ చర్యలన్నీ తీసుకుంటామని.. పదో తరగతి పరీక్షలు నిర్వహించేందుకు అనుమతివ్వాలని అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ కోరారు. కరోనా తీవ్రత కొనసాగుతుండగా.. లాక్​డౌన్ వేళ పరీక్షలు నిర్వహించడం మంచిది కాదని పిటిషనర్ తరఫు న్యాయవాది పవన్ కుమార్ వాదించారు. ఇరువైపుల వాదనలు విన్న ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్, బి.విజయ సేన్ రెడ్డి ధర్మాసనం... లాక్ డౌన్ కొనసాగుతుండగా పరీక్షలు నిర్వహించవద్దని తెలిపింది.

కరోనా తీవ్రతను బట్టే..

జూన్ మొదటి వారంలో పరిస్థితి సమీక్షించి ఆ తర్వాత నిర్వహించుకోవాలని సూచించింది. జూన్ 3న పరిస్థితిని సమీక్షించి.. 4న తమకు నివేదిక సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. జూన్ 3నాటికి కరోనా పరిస్థితులు తీవ్రంగా ఉన్నట్లయితే.. పరీక్షల నిర్వహణకు ముందుకెళ్లవద్దని స్పష్టం చేసింది. అయితే విద్యార్థుల్లో అనిశ్చితి తొలగించేందుకు జూన్ 8 లేదా ఆ తర్వాత నుంచి పరీక్షలు నిర్వహించుకునేలా షెడ్యూలు ప్రకటించేందుకు ధర్మాసనం అనుమతినిచ్చింది. జూన్ 3 నాటికి పరిస్థితుల ఆధారంగా తుది నిర్ణయం ఉంటుందనే విషయం కూడా నోటిఫికేషన్​లో స్పష్టం చేయాలని తెలిపింది.

రెండ్రోజులకు ఒకటి..

పరీక్ష కేంద్రాలను శుభ్రం చేసేందుకు వీలుగా ప్రతీ పరీక్షకు రెండు రోజుల వ్యవధి ఉండాలని హైకోర్టు స్పష్టం చేసింది. భౌతిక దూరం సాధ్యం కాని ఇరుకు గుదుల్లో పరీక్ష నిర్వహించవద్దని.. అలాంటివి ఉన్నట్లయితే సమీపంలోని ప్రత్యామ్నాయ పాఠశాలలు, కళాశాలలను సిద్ధం చేసుకోవాలని తెలిపింది. పరీక్షా కేంద్రం మారినట్లయితే విద్యార్థులకు ముందస్తుగా సమాచారం ఇవ్వాలని తెలిపింది. పరీక్ష కేంద్రాల వద్ద ఇబ్బందులు ఉంటే సమాచారం ఇచ్చేందుకు హెల్ప్ లైన్ ఏర్పాటు చేసి విస్తృత ప్రచారం చేయాలని తెలిపింది.

ఇవీ చూడండి: లక్ష్మీపురంలో విషాదం.. కుటుంబాన్ని మింగేసిన చెరువు

Last Updated : May 19, 2020, 4:09 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.