ETV Bharat / state

తామేమి మొగల్​ చక్రవర్తులం కాము: హైకోర్టు - TELANGANA HC COMMENTS ON shelter homes

షెల్టర్​ హోంలు లేక అనాథలు, వృద్ధులు, బాలలు, మహిళలు ఇబ్బందులు పడుతున్నారని దాఖలైన వ్యాజ్యంపై విచారణ సందర్భంగా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. తామేమి మొగల్​ చక్రవర్తులం కామని స్పష్టం చేసింది. తాము ఇచ్చిన ఉత్తర్వులపై సుప్రీంను ఆశ్రయించవచ్చని.. అలాంటి సమయంలో ఎటువంటి ఆధారాలు లేకుండా ఉత్తర్వులు ఇవ్వలేవని స్పష్టం చేసింది.

TELANGANA HIGH COURT ON SHELTER HOMES
తామేమి మొగల్​ చక్రవర్తులం కాము: హైకోర్టు
author img

By

Published : Jun 24, 2020, 4:52 AM IST

షెల్టర్ హోంలు లేక అనాథలు, వృద్ధులు, బాలలు, మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని... మౌఖికంగా తప్ప ఉత్తర్వులు జారీ చేయలేమని హైకోర్టు స్పష్టం చేసింది. పూర్తి వివరాలతో అఫిడవిట్ దాఖలు చేస్తే పరిశీలిస్తామని పేర్కొంది. ఫర్మానాలు జారీ చేయడానికి మొగల చక్రవర్తులం కామని వ్యాఖ్యానించింది. తాము ఇచ్చిన ఉత్తర్వులపై సుప్రీం కోర్టుకు వెళ్లవచ్చని.. అలాంటి సమయంలో ఎటువంటి ఆధారాలు లేకుండా ఉత్తర్వులు ఇవ్వలేవని స్పష్టం చేసింది.

లాక్‌డౌన్‌ నేపథ్యంలో వీధి బాలలు, యాచకులు రోడ్లపైనే నివాసం ఉంటున్నారని వారికి ప్రయోజనాలు కల్పించాలటూ న్యాయవాది ఎస్‌. నంద, ప్రొఫెసర్ విశ్వేశ్వరరావు ప్రజా ప్రయోజనాల వ్యాజ్యాలు దాఖలు చేశారు. ధర్మాసనం విచారణ చేపట్టింది.

ఇటువంటి అంశాలపై మూడు నివేదికలను ప్రభుత్వం సమర్పించిందని.. న్యాయవాది ఎస్‌. నంద నివేదించారు. దీని పై ధర్మాసనం జోక్యం చేసుకుంటూ ఇప్పటికే పలు అంశాలకు సంబందించి ఐదు నివేదికలు సమర్పించిందని వాటిని పిటిషనర్లకు అందజేయాలని ఏజీ ప్రసాద్‌కు కోర్టు సూచించింది.

గతంలో వలస కార్మికుల కోసం ఏర్పాటుచేసిన తాత్కాలిక గృహాల్లో వారితో పాటు అనాథ పిల్లలు, యాచకులు ఉండేవారని పిటిషనర్‌ కోర్టుకు తెలిపారు. వలస కార్మికులు వెళ్లిపోయాక గృహాలు మూసివేయడం వల్ల తిరిగి రోడ్డున పడ్డారని తెలిపారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ.. ఇప్పటికే వృద్ధాశ్రమాలకు సంబంధించి విచారణ కొనసాగుతోందని.. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 120 వృద్ధాశ్రమాలను తనిఖీ చేసి నివేదిక ఇవ్వాలని సాంఘిక సంక్షేమ ముఖ్య కార్యదర్శికి ఆదేశాలు జారీచేశామని చెప్పింది. ప్రభుత్వం దాఖలు చేసిన అన్ని నివేదికలను పరిశీలించాక పూర్తి వివరాలతో అఫిడవిట్‌ దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణను కోర్టు జులై 5కి వాయిదా వేసింది.

ఇదీ చదవండి: పీవీకి భారతరత్న ఇవ్వాలి... పార్లమెంటులో చిత్రపటం పెట్టాలి: కేసీఆర్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.