కోర్టు ధిక్కరణ కేసుల ఖర్చులకు రూ.58 కోట్ల మంజూరుపై హైకోర్టు విచారణ చేపట్టింది. నిధులు విడుదల చేయవద్దని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. కోర్టు ధిక్కరణ కేసులకు రూ.58 కోట్లు మంజూరు చేయడంపై లెక్చరర్ ప్రభాకర్ హైకోర్టులో పిల్ వేశారు. దీనిపై జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ విజయ్‌సేన్‌రెడ్డి ధర్మాసనం విచారణ జరిగింది. కోర్టు ధిక్కరణ కేసులకు రూ.58 కోట్లు ఇవ్వడమేంటని హైకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ప్రజాధనం ఎలా ఖర్చు చేస్తారో వివరించాలని స్పష్టం చేసింది.
ట్రెజరీ నిబంధనలు ఎలా అనుమతిస్తాయో చెప్పాలంది. రెవెన్యూ, ఆర్థికశాఖ కార్యదర్శులు, సీసీఎల్ఏ, ట్రెజరీ డైరెక్టర్‌కు నోటీసులిచ్చింది. సీఎస్ సోమేశ్‌కుమార్‌కు వ్యక్తిగత హోదాలో నోటీసు జారీ చేసింది. తదుపరి విచారణను అక్టోబరు 27కు వాయిదా వేసిన రాష్ట్ర ఉన్నతన్యాయస్థానం.. అప్పటివరకు నిధులు విడుదల చేయవద్దని ప్రభుత్వాన్ని ఆదేశించింది.
ఇదీ చదవండి: CJI JUSTICE NV RAMANA: 'కృష్ణా నదీ జలాల పిటిషన్‌పై నేను విచారణ చేపట్టను'